ముంబై గాలులకు చిగురుటాకులా వణికిన చెట్లు..ఆనంద్ మహీంద్రా ‘ట్వీట్లు’

ముంబైలో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమవుతోంది. గంటకు 107 కి.మీ. వేగంతో వీస్తున్న పెనుగాలులు తుపాను..

ముంబై గాలులకు చిగురుటాకులా వణికిన చెట్లు..ఆనంద్ మహీంద్రా ట్వీట్లు

Edited By:

Updated on: Aug 06, 2020 | 3:47 PM

ముంబైలో సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలు, వరదలతో నగరం అతలాకుతలమవుతోంది. గంటకు 107 కి.మీ. వేగంతో వీస్తున్న పెనుగాలులు తుపాను బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఓ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..ఈ వర్షాలు, భారీ గాలులు ఎంత ఉధృతంగా ఉన్నాయో చూడండి.. ఈ చెట్టు అయితే ‘తాండవమే’ ఆడుతోంది.. ఈ సైక్లోన్ డ్రామాను, ప్రకృతి ఆగ్రహంతో చేస్తున్న నృత్యాన్ని చూడండి అంటూ కవితాత్మకంగా కూడా కామెంట్ చేశారు. మరికొందరు పెట్టిన వీడియోలను కూడా ఆయన పోస్ట్ చేశారు. మనం కూడా చూసేద్దాం..