బీజేపీ ఎంపీ ఇంట్లో గజరాజు బీభత్సం..

ఛత్తీస్‌ గఢ్‌లో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. జష్పూర్‌లో మంగళవారం సాయంత్రం గోమతి సాయి ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎంపీ నివాసంలో ఓ గజరాజు ప్రవేశించింది. అక్కడ ఉన్న చెట్లన్నింటిని..

బీజేపీ ఎంపీ ఇంట్లో గజరాజు బీభత్సం..

Edited By:

Updated on: Jul 01, 2020 | 10:35 AM

ఛత్తీస్‌ గఢ్‌లో ఓ గజరాజు బీభత్సం సృష్టించింది. జష్పూర్‌లో మంగళవారం సాయంత్రం గోమతి సాయి ప్రాంతంలో ఉన్న బీజేపీ ఎంపీ నివాసంలో ఓ గజరాజు ప్రవేశించింది. అక్కడ ఉన్న చెట్లన్నింటిని నాశనం చేసింది. మామిడి చెట్లతో పాటు.. అరటి చెట్లన్నింటిని విరగ్గొట్టింది. అంతేకాదు అక్కడ ఖాళీ స్థలంలో ఉన్న సోలార్ ప్యానెల్స్‌ను కూడా ధ్వంసం చేసింది. అలా అన్నింటిని ధ్వంసం చేసిన తర్వాత.. నెమ్మదిగా అడవిలోకి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆ ప్రాంత డివిజన్ ఫారెస్ట్ అధికారి తెలిపారు. కాగా, గత కొద్ది రోజులుగా లాక్డౌన్ కొనసాగుతుండటంతో.. అడవిలో ఉన్న జంతువులు పలు ప్రాంతాల్లో గ్రామాల్లోకి ప్రవేశిస్తున్నాయి. కేరళలో కూడా రాత్రి సమయంలో కొన్ని ఏనుగులు గ్రామాల్లోకి వచ్చి.. ఆ తర్వాత తిరిగి అడవి బాట పట్టాయి. అంతేకాదు ఇతర దేశాల్లో కూడా ఇలాంటి సీన్లు రిపీట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఎంపీ ఇంట్లోకి రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది.