Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని ఉందా? ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే

|

Apr 10, 2022 | 5:43 AM

Amarnath Yatra 2022: శివుడిని భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా పూజిస్తారు. మంచు లింగం రూపంలో, ఈ భూమిపై కనిపించే హిందువుల ప్రీతిపాత్రుడైన..

Amarnath Yatra 2022: అమర్‌నాథ్ యాత్రకు వెళ్లాలని ఉందా? ఎలా వెళ్లాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే, ఈ వార్త మీ కోసమే
Amarnath Yatra 2022
Follow us on

Amarnath Yatra 2022: శివుడిని భారతీయులు మాత్రమే కాకుండా ఇతర దేశాల ప్రజలు కూడా పూజిస్తారు. మంచు లింగం రూపంలో, ఈ భూమిపై కనిపించే హిందువుల ప్రీతిపాత్రుడైన దేవునికి దగ్గరవ్వడానికి, లక్షలాది మంది భక్తులు ఏటా వేసవి నెలల్లో భారత్‌కు తరలివస్తారు. దక్షిణ కాశ్మీర్‌ (Kashmir)లోని శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రానికి భయంకరమైన పర్వతాల గుండా ట్రెక్కింగ్ చేసిమరీ వస్తారు భక్తులు. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra)నిర్వహించలేదు. 2019లో కూడా ఆగస్టు 5కి కొద్ది రోజుల ముందు యాత్ర నిలిపివేశారు. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన సందర్భంలో ఆ నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా ఈ యాత్రకు వెళ్లాలనుకునేవారికి గుడ్‌ న్యూస్‌ చెప్పింది ఆ పుణ్యక్షేత్రం బోర్డు. అమర్‌నాథ్ యాత్ర 2022 జూన్ 30న ప్రారంభమై, ఆగస్టు 11న ముగుస్తుందని తెలిపింది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ రేపు ప్రారంభం కానుంది. యాత్రికులు పుణ్యక్షేత్రం బోర్డు వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా కూడా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని బోర్డు అధికారులు చెబుతున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో, 3వేల మంది యాత్రికులు కూర్చునేందుకు వీలుగా యాత్రి నివాస్‌ను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది బోర్డు. ఈ ఏడాది దాదాపు మూడు లక్షల మంది యాత్రికులు పుణ్యక్షేత్రానికి వస్తారని బోర్డు అంచనా వేస్తోంది. యాత్రికులకు ఆర్ఎఫ్ఐడీ సమకూర్చుతామని, దీని ద్వారా పుణ్యక్షేత్రం బోర్డు యాత్రికులను ట్రాక్ చేయవచ్చని చెబుతున్నారు అధికారులు. యాత్రికుల బీమా కవరేజీ ఈ సంవత్సరం 3 లక్షల నుంచి 5 లక్షలకు పెరిగిందని వివరించారు. గతంలో జరిగిన పొరపాట్లు పునరావృతం అవ్వకుండా, జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు చెప్పారు పుణ్యక్షేత్రం బోర్డు అధికారులు.

ఇవి కూడా చదవండి:

Lord Murugan Statue: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన మురుగన్ విగ్రహాం.. ఇక తమిళనాడులో చూడొచ్చు..!

AP Politics: మంత్రులందరితో రాజీనామా చేయించిన ముఖ్యమంత్రులు సక్సెస్ అయ్యారా..? ఆ రోజు అసలు ఏం జరిగింది!