ఢిల్లీ స్కూళ్ళు నెలరోజులు బంద్.. ఎందుకంటే ?

| Edited By: Anil kumar poka

Mar 05, 2020 | 5:21 PM

ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్, ఎంసీడీ, ఎన్డీఎంసీ స్కూళ్లన్నీ ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని డిప్యూటీ  సీఎం

ఢిల్లీ స్కూళ్ళు నెలరోజులు బంద్.. ఎందుకంటే ?
Follow us on

ఢిల్లీలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేట్, ఎంసీడీ, ఎన్డీఎంసీ స్కూళ్లన్నీ ఈ నెల 31 వరకు మూసివేయనున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా చూసేందుకు ఢిల్లీ ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని డిప్యూటీ  సీఎం, విద్యాశాఖను కూడా పర్యవేక్షిస్తున్న మనీష్ శిశోడియా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అటు-దేశ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 30 కి పెరిగింది. నోయిడా లో ఓ స్కూలు విద్యార్థి తండ్రికి కరోనా సోకిందన్న సమాచారంతో ఆస్కూలును అనధికారికంగా మూసివేశారు. ఆ బడికి తమ పిల్లలను పంపరాదని  విద్యార్థులు తలిదండ్రులు నిర్ణయించుకున్నారు. పైగా ఆ విద్యార్ధి బర్త్ డే పార్టీ నాడు ఆరోగ్య శాఖ అధికారులు అతని ఇంటికి వఛ్చి .. ఆ పార్టీకి హాజరైన వారందరికీ టెస్టులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటలీ నుంచి వఛ్చిన ఆ కుర్రాడి తండ్రి రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ..కోలుకుంటున్నారు. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో .. కరోనా ప్రబలంగా  ఉందని భావిస్తున్న ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చర్యను తీసుకోవచ్ఛు.