ఎంపీలందరూ కరోనా పరీక్షలు జరిపించుకోవల్సిందే!

|

Aug 29, 2020 | 1:52 PM

పార్లమెంట్‌ సమావేశాలకు ఇంకా రెండువారాల పైనే సమయం ఉంది.. నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం వేగంగా సాగుతున్నాయి.. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఎంపీలందరూ కరోనా పరీక్షలు జరిపించుకోవల్సిందే!
Follow us on

పార్లమెంట్‌ సమావేశాలకు ఇంకా రెండువారాల పైనే సమయం ఉంది.. నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు మాత్రం వేగంగా సాగుతున్నాయి.. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సకల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యే ప్రతి ఒక్క పార్లమెంట్‌ సభ్యుడూ కరోనా పరీక్షలు జరిపించుకోవలసిందేనని స్పీకర్‌ ఓం బిర్లా అన్నారు.. సమావేశాలకు 72 గంటల ముందు కరోనా పరీక్షలను చేయించుకోవాలని చెప్పారు. ఎంపీలకే కాదు, పార్లమెంట్‌ ఆవరణలో ప్రవేశించి ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలను నిర్వహిస్తామని స్పీకర్‌ స్పష్టం చేశారు. వచ్చే నెల 14 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు జరుగుతున్నాయి.. ఇందుకు సంబంధించిన ఏర్పాట్ల కోసం స్పీకర్‌ ఆల్‌రెడీ పలువురుతో సమావేశమయ్యారు.. పార్లమెంట్‌ ఆవరణలో ఇంతకు ముందులా కాకుండా టచ్‌ చేయకుండానే జరపాలని నిర్ణయించారు. సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎవరికైనా కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయితే ర్యాండమ్‌గా పరీక్షలు జరుపుతామని, ఎవరూ ఎలాంటి భయాందోళనలు పెట్టుకోవద్దని స్పీకర్‌ భరోసా ఇచ్చారు. రెండు షిఫ్టులలో సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నారు.. అలాగే పార్లమెంట్‌ లోపల కూడా సీట్లను సర్దుబాటు చేస్తున్నారు.. ఇంతకు ముందులా సభ్యులు పక్కపక్కనే కూర్చోడానికి కుదరదు.. సోషల్‌ డిస్టెన్సింగ్ పాటించాల్సిందే.