ఢిల్లీలో 6 నుంచి మళ్ళీ కళకళలాడనున్న తాజ్ మహల్..ఇంకా…

హస్తినలో ఈ నెల 6 నుంచి మళ్ళీ  తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రముఖ స్మారకాలను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత మార్చి 17 నుంచి భారత పురావస్తు శాఖ మొత్తం 3,400 స్మారకాలను మూసివేసిన..

ఢిల్లీలో 6 నుంచి మళ్ళీ కళకళలాడనున్న తాజ్ మహల్..ఇంకా...

Edited By:

Updated on: Jul 02, 2020 | 6:32 PM

హస్తినలో ఈ నెల 6 నుంచి మళ్ళీ  తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్ వంటి ప్రముఖ స్మారకాలను ప్రజల సందర్శనార్థం తెరవనున్నారు. కరోనా వైరస్, లాక్ డౌన్ కారణంగా గత మార్చి 17 నుంచి భారత పురావస్తు శాఖ మొత్తం 3,400 స్మారకాలను మూసివేసిన సంగతి తెలిసిందే.. అయితే అన్ లాక్ మొదటి దశను ప్రభుత్వం ప్రకటించగానే..వీటిలో సుమారు 820 స్మారకాలను తిరిగి ప్రారంభించారు. ఇతర మాన్యుమెంట్స్ ను కూడా తెరవ వచ్ఛునని, ఇది ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని కేంద్ర టూరిజం శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ తెలిపారు. మధ్యప్రదేశ్ లోని సాంచీ, ఢిల్లీ లోని పురానా ఖిలా, ఇంకా ఖజురాహో వంటి వాటి ఫోటోలను ఆయన ట్వీట్ చేస్తూ..ఈ నెల ఆరో తేదీనుంచి వీటిని ఓపెన్ చేస్తున్నట్టు స్పష్టం చేశారు. కంటెయిన్మెంట్ జోన్లలో తప్ప ఇతర చోట్ల అన్ లాక్-2 ను ప్రభుత్వం జూన్ 30 న ప్రకటించింది.