Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. శిండేను తప్పించి అజిత్ పవార్‌కు మహారాష్ట్ర సీఎంగా అవకాశం ?

|

Jul 04, 2023 | 8:33 AM

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ శిండే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి.

Maharashtra: మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్.. శిండేను తప్పించి అజిత్ పవార్‌కు మహారాష్ట్ర సీఎంగా అవకాశం ?
Ajit Pawar
Follow us on

మహారాష్ట్ర రాజకీయాల్లో రోజురోజుకు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉన్న ఏక్‌నాథ్ శిండే సహా ఆయన వర్గానికి చెందిన 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు మహారాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారని ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో శిండేను సీఎంగా చేసిన బీజేపీ ఇప్పుడు అంతకంటే బలమైన మరఠా నేతలకు పగ్గాలు అప్పగించి లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా 16 మంది శిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై స్పీకర్ ఆగస్టు 11 లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే అజిత్ పవార్‌కు అవకాశ ఇవ్వాలని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మహారాష్ట్ర రాజకీయాలపై శివసేన (ఉద్ధవ్‌) పత్రిక సామ్నా ప్రచురించిన సంపాదకీయం కూడా సంచలనం రేపింది. ఏడాది క్రితమే శివసేనను చిల్చీ 16 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గరవుతారని ఆ సంపాదకీయంలో తెలిపింది రాబోయే రోజుల్లో సీఎం ఏక్‌నాథ్ శిండే స్థానంలో అజిత్ పవార్‌ను భర్తీ చేస్తారని.. శిండే ఆయన మద్ధతుదారులపై అనర్హత వేటు పడుతుందని పేర్కొంది.

గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బ్రిటీష్ వాళ్లే మేలని.. వీళ్లలాగా దొంగదెబ్బ తీసేవాళ్లు కాదని విమర్శించింది. దీనిపై స్పందించిన బీజేపీ ఈ విమర్శల్ని ఖండించింది. అనర్హత వేటు సంబంధించిన విషయంలో తమకు వ్యతిరేకంగా నిర్ణయం ఉండదని.. ఒకవేళ తీసుకున్నా ప్రభుత్వానికి ఇబ్బంది ఉండదని బీజేపీ నేత మాధవ్ భండారి స్పష్టం చేశారు. ఇక మహారాష్ట్రంలో ఉన్న 48 లోక్ సభ సీట్లలో 45 దాకా గెలవాలని బీజేపీ కొరుకుంటుందని పలువురు విశ్లేషకులు వాదిస్తున్నారు. కాని ప్రస్తుతం శిండే వల్ల ఇన్ని సీట్లు గెలవడం సాధ్యం కాదని.. అందుకే మరో మరాఠ నేత అజిత్ పవార్‌ను ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తోందని.. శిండే కంటే అజిత్ ఎక్కువగా ప్రభావం చూపిస్తారని బీజేపీ నమ్ముతోందని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా శిండేతో పాటు 16 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా కూడా బీజేపీ కుటమికి ఎలాంటి నష్టం జరగదని మహారాష్ట్ర విధానసభ మాజీ అధికారి అనంత్ కల్సే తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి