175 మందితో ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీ అలారం.. ఏంటా అని చూడగా..

|

May 17, 2024 | 9:38 PM

విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ఫైర్ అలారం మోగినట్లు చెబుతున్నారు. దీంతో విమానాన్ని హడావుడిగా ఢిల్లీకి తీసుకొచ్చి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉండగా..

175 మందితో ప్రయాణిస్తున్న విమానం.. ఒక్కసారిగా మోగిన ఎమర్జెన్సీ అలారం.. ఏంటా అని చూడగా..
Air India Flight
Follow us on

ఎయిరిండియా ఢిల్లీ-బెంగళూరు విమానం AI-807కి ఎమర్జెన్సీ ప్రకటించడంతో ఢిల్లీ విమానాశ్రయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగడంతో అత్యవసర పరిస్థితి ఏర్పడింది. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉండడంతో అధికారులు వేగంగా స్పందించి తగిన చర్యలు చేపట్టారు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దింపేశారు. ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో మంటలు చెలరేగడంతో విమానాన్ని తిరిగి ఐజీఐ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ చేయాల్సి వచ్చింది. అగ్నిప్రమాదం తర్వాత, విమానం సాయంత్రం 6:38 గంటలకు విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయబడింది.

ఎయిర్ కండిషనింగ్ యూనిట్‌లో మంటలు చెలరేగే అవకాశం ఉండటంతో ఢిల్లీ నుంచి బెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం లో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఢిల్లీ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో ఫైర్ అలారం మోగినట్లు చెబుతున్నారు. దీంతో విమానాన్ని హడావుడిగా ఢిల్లీకి తీసుకొచ్చి అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. విమానంలో 175 మంది ప్రయాణికులు ఉండగా అందరూ క్షేమంగా ఉన్నారు.

విమానంలో ఫైర్ అలారం మోగడంతో ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. విమానాన్ని త్వరగా ఢిల్లీకి తీసుకురావాలని పైలట్ నిర్ణయించుకున్నాడు. విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడం కోసం విమానాశ్రయంలో కొద్దిసమయం పాటు  అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. సాయంత్రం 6:38 గంటల ప్రాంతంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ మేరకు ఎయిర్ ఇండియా ఒక ప్రకటన విడుదల చేసింది. పైలట్లు అవసరమైన ప్రోటోకాల్‌లను అనుసరించిన తర్వాత, విమానం సురక్షితంగా ల్యాండింగ్ చేయబడింది. ప్రయాణీకులు, సిబ్బంది అందరూ ఏరోబ్రిడ్జ్‌పై సురక్షితంగా బయటపడ్డారు. ప్రయాణికులు బెంగళూరు వెళ్లేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..