Air India Halal: హలాల్ భోజనంపై ఎయిరిండియా సంచలన నిర్ణయం.. ఇక పై హిందువులకు, సిక్కులకు అందించమని స్పష్టం.

|

Nov 11, 2024 | 8:13 PM

ఎయిర్ ఇండియా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ విమానాల్లో ప్రయాణించే హిందువులు, సిక్కులకు ఇకపై 'హలాల్' ఆహారాన్ని అందించబోమని టాటా గ్రూప్ యాజమాన్యం తెలిపింది. గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానంలో ఆహారం విషయంలో వివాదాల్లో చిక్కుకున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

Air India Halal: హలాల్ భోజనంపై ఎయిరిండియా సంచలన నిర్ణయం.. ఇక పై హిందువులకు, సిక్కులకు అందించమని స్పష్టం.
Air India
Image Credit source: Tata Group
Follow us on

ఎయిర్‌లైన్ ప్రకారం MOML స్టిక్కర్ ఉన్న భోజనాన్ని ముస్లిం భోజనంగా పరిగణించాలని, SPML ను స్పెషల్ మీల్‌గా పరిగణించాలని వెల్లడించింది. MOML అంటే హలాల్ భోజనం.. KSML అనేది యూదుల మత చట్టాలకు అనుగుణంగా ఉండే భోజనం. సౌదీ సెక్టార్‌లోని అన్ని ఆహార పదార్థాలు హలాల్‌గా ఉంటాయి. జెద్దా, దమ్మామ్, రియాద్, మదీనా సెక్టార్‌లతో సహా హజ్ విమానాల్లో హలాల్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది.

ఇవి కూడా చదవండి

‘MOML అని రాసి లేబుల్ ఉండే ఆహారం.. ముస్లిం కమ్యూనిటీ కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాల పద్ధతిలో హలాల్ సర్టిఫికేషన్ నిబంధనలకు లోబడి ఆహారాన్ని తయారుచేస్తామని పేర్కొంది. హిందువుల కోసం ప్రత్యేకంగా భారతీయ వంటకాల పద్ధతిలో చికెన్, ఫిష్, ఎగ్స్, కూరగాయలు, డెయిరీ ఉత్పత్తులను HNML అని రాసిన లేబుల్ తో అందిస్తామని వెల్లడించింది. అంతేకాదు ఇక నుంచి జైనుల కోసం VJML ఆహారాన్ని, జ్యూయిష్ కమ్యూనిటీ కోసం KSML మీల్స్ ను అందించనున్నామని ప్రకటించింది.

ఎయిర్ ఇండియా ఆహార వివాదం ఏమిటి?

గత కొన్ని రోజులుగా ఎయిర్ ఇండియా విమానంలో ఆహారం విషయంలో వివాదాల్లో చిక్కుకుంది. ఈ నేపధ్యంలో ఎయిర్ ఇండియా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 17న కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఎయిర్ ఇండియా అందించే ఆహారాన్ని మతం ఆధారంగా లేబుల్ చేసింది అని ఆందోళన వ్యక్తం చేశారు.

హలాల్, ఝట్కా మాంసం అంటే ఏమిటి?

ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం ఆ మతానికి చెందిన వారు హలాల్ మాంసాన్ని తింటారు., ఇది జంతువును వధించడానికి అనుసరించే భిన్నమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో జంతువు నేరుగా వధించబడదు.. నెమ్మదిగా ముక్కలు చేయబడుతుంది. అదే సమయంలో జంతువుని వధించడానికి మరొక ప్రక్రియ ఉంది. దీనిని ఝట్కా అని అంటారు. ఈ ప్రక్రియలో జంతువును నేరుగా ఒకేసారి వధిస్తారు. భారతదేశంలోని కొన్ని సంఘాలు, ముఖ్యంగా సిక్కులు ప్రధానంగా ఆచరించే జంతు వధ పద్ధతి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..