
అహ్మదాబాద్‌లో తృటిలో మరో విమాన ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో రద్దు చేశారు. టేకాఫ్ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తరువాత లండన్‌కు వెళ్తున్న తొలి విమానం ఇదే. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేశారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదంలో DNA పరీక్షల ఆధారంగా ఇంకా మృతదేహాల గుర్తింపు ప్రక్రియ జరుగుతూనే ఉంది. అటు.. 12వ తేదీ నుంచి నిలిచిపోయిన అహ్మదాబాద్ -లండన్ సర్వీస్‌కి పేరు మార్చారు. ఇప్పటి వరకూ AI-171గా ఉన్న ఫ్లైట్ పేరు AI-159గా మార్చారు. ఐతే.. ఇవాళ బయలుదేరాల్సిన సర్వీస్ రద్దైంది.