Air Charges Hiked: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మరింత భారంగా మారనున్న విమాన ప్రయాణం.!

Air Fares Hiked: విమాన ప్రయాణీకులకు షాక్ ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసుల టికెట్ల...

Air Charges Hiked: ప్రయాణీకులకు బ్యాడ్ న్యూస్.. మరింత భారంగా మారనున్న విమాన ప్రయాణం.!

Updated on: Feb 12, 2021 | 12:40 PM

Air Fares Hiked: విమాన ప్రయాణీకులకు షాక్ ఇస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ విమాన సర్వీసుల టికెట్ల ధరలను 10-30 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెంచిన ఛార్జీలు మార్చి 31 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు అమలులో ఉంటాయని వెల్లడించింది.

ఇదిలా ఉంటే అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత గతేడాది మే 25వ తేదీన విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమైన సంగతి విదితమే. అప్పటి నుంచి ప్రయాణ సమయం ఆధారంగా విమానాలను ఏడు రకాలుగా విభజించి.. వాటి టికెట్ ధరలపై కేంద్రం పరిమితులు విధించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తాజా పెంచిన రేట్ల పరంగా కనిష్ట టికెట్ ధర రూ. 2,200 నుంచి గరిష్టంగా రూ. 24, 200 వరకు ఉంది.

20 దేశాల విమాన ప్రయాణీకులపై సౌదీ ఆంక్షలు..

20 దేశాలకు చెందిన ప్రయాణీకులపై సౌదీ అరేబియా ఆంక్షలు విధించింది. అక్కడ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఆంక్షలు విధించిన దేశాల్లో భారత్ కూడా ఉండటం గమనార్హం.

మరిన్ని చదవండి:

‘ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!

ఫస్ట్ నైట్ రోజు భార్యను పట్టించుకోకుండా.. కంప్యూటర్‌తో.. నెట్టింట్లో రచ్చ.. రచ్చ..

టీవీ ప్రోగ్రామ్‌ స్టంట్‌లు కాపీ కొట్టాడు.. ఏకంగా నదిలోకే దూకేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

Loading...
Unable to load recommendations.
Follow Us