Ashutosh Dixit: భారత 29వ వైమానిక దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్

భారత వైమానిక దళ 29వ అధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు స్వీకరించారు. భారత వాయుసేనను ఆధునీకరించడం, పోరాట సంసిద్ధతను మెరుగుపరచడం, స్వదేశీ రక్షణ సామర్థ్యాలను పెంపొందించడంపై ఆయన దృష్టి సారించనున్నారు. 40 ఏళ్లకు పైగా విశిష్ట సేవలందించిన దీక్షిత్, మిరాజ్-2000, తేజస్ వంటి విమానాల ఆధునీకరణలో కీలక పాత్ర పోషించారు. ఇక తాజాగా ఆయన్ను కలిసిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ దీక్షిత్‌ను అభినందించారు.

Ashutosh Dixit: భారత 29వ వైమానిక దళాధిపతిగా బాధ్యతలు చేపట్టిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
29th Iaf Chief Ashutosh Dixit

Edited By:

Updated on: Nov 02, 2026 | 2:55 PM

భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ బాధ్యతలు చేపట్టారు. దేశానికి 42 సంవత్సరాల పాటు విశిష్ట సేవలందించిన ఎయిర్ చీఫ్ మార్షల్ ఎపి సింగ్ స్థానంలో అశుతోష్ దీక్షిత్ నియమితులయ్యారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొత్తగా నియమితులైన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ ను కలిసి అభినందించారు. అశుతోష్ దీక్షిత్ పదవీకాలం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వాయుసేనకి అద్భుతమైన నాయకత్వానికి పేరుగాంచిన ఒక విశిష్ట వాయు యోధుడుగా అశుతోష్ దీక్షిత్ ను కొనియాడారు. భారత వాయుసేన పోరాట సంసిద్ధత, వాయుసేన సామర్థ్యాన్ని పునరుద్ధరించడం, స్వదేశీ రక్షణ సామర్థ్యాలు, సాంకేతిక ఆవిష్కరణలు సాయుధ దళాల మధ్య సమన్వయం వంటి అంశాలపై దృష్టి సారిస్తానని అశుతోష్ దీక్షిత్ స్పష్టం చేశారు

ఎవరీ అశుతోష్ దీక్షిత్..?

నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి అయిన ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్, 1986 డిసెంబర్ 6న భారత వైమానిక దళంలోని ఫైటర్ స్ట్రీమ్లోకి నియమితులయ్యారు. నాలుగు దశాబ్దాల పాటు సాగిన తన కెరీర్లో, ఎయిర్ చీఫ్ ఆపరేషన్స్, ఫ్లైట్ టెస్టింగ్, సామర్థ్య అభివృద్ధి జాయింట్ స్టాఫ్ అసైన్మెంట్లు వంటి విభిన్న రంగాలలో విస్తారమైన అనుభవం ఉంది. ఆయన నిష్ణాతుడైన ఫైటర్ పైలట్, అర్హత కలిగిన ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ , ప్రయోగాత్మక టెస్ట్ పైలట్ అయిన ఆయనకు, మిరాజ్-2000, వివిధ మిగ్ వేరియంట్లు, జాగ్వార్ అనేక రవాణా విమానాలతో సహా విస్తృత శ్రేణి విమానాలలో 3,300 గంటలకు పైగా విమానయాన అనుభవం ఉంది.

భారత వైమానిక దళ ఆధునీకరణకు ఆయన చేసిన కృషికి విస్తృతంగా గుర్తింపు పొందిన ఆయన, జాగ్వార్ , మిగ్-27 ఆధునీకరణ ప్రాజెక్టులను ఖరారు చేయడంలో, ఎల్సిఎ మార్క్-1 తేజస్ యొక్క ఇనీషియల్ ఆపరేషనల్ క్లియరెన్స్ (ఐఓసి) ఫైనల్ ఆపరేషనల్ క్లియరెన్స్ (ఎఫ్ఎసి) కార్యకలాపాలను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అశుతోష్ దీక్షిత్ కార్యాచరణ కమాండ్ నియామకాలలో మిరాజ్ – 2000 స్క్వాడ్రన్, పశ్చిమ సెక్టార్లోని ఫార్వర్డ్ బేస్ సపోర్ట్ యూనిట్ ఐఎఎఫ్ ,యొక్క ప్రధాన ఫైటర్ శిక్షణా స్థావరమైన బీదర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ కమాండ్ ఉన్నాయి.

అశుతోష్ దీక్షిత్ ఎయిర్ ఆఫీసర్ సదరన్ ఎయిర్ కమాండ్లో ఎయిర్ డిఫెన్స్ కమాండర్ గా సౌత్ వెస్ట్రన్ ఎయిర్ కమాండ్లో సీనియర్ ఎయిర్ స్టాఫ్ ఆఫీసర్ గా , డిప్యూటీ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా పనిచేస్తూ, కీలక సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలకు సారథ్యం వహించారు. సెంట్రల్ ఎయిర్ కమాండ్ ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా బాధ్యతలు చేపట్టారు.

ఆపరేషన్ సింధూర్ సమయంలో చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ కు చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ గా పనిచేశారు. చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు, ఆయన వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ గా కూడా పనిచేశారు.అశుతోష్ దీక్షిత్ సైనిక సేవలకు గానూ పరమ విశిష్ట సేవా పతకం (2026), అతి విశిష్ట సేవా పతకం (2023), వాయు సేనా పతకం (2006), విశిష్ట సేవా పతకం (2011) పొందారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us