మద్రాస్ హైకోర్టులో అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీ పళనిస్వామికి ఊరట లభించింది. మరోవైపు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నేత పన్నీర్‌సెల్వంకు మద్రాసు హైకోర్టు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనస్వామి కొనసాగవచ్చని ఇద్దరు సభ్యుల ధర్మాసనం తీర్పునిచ్చింది. సింగిల్‌బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను మద్రాస్ హైకోర్టు కొట్టేసింది. కోర్టు తీర్పు అనుకూలంగా రావడంతో పళనిస్వామి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు. అన్నాడీఎంకే తాత్కాలిక జనరల్ సెక్రటరీగా పళనిస్వామి ఎన్నికను సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం గతంలో హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్‌బెంచ్ తీర్పు పన్నీర్‌సెల్వంకు అనుకూలంగా వచ్చింది. దీనిని సవాల్ చేస్తూ పళనిస్వామి ద్విసభ్య ధర్మాసనాన్ని ఆశ్రయించారు.
జస్టిస్ ఎం దురైస్వామి, సుందర్ మోహన్‌లతో కూడిన డివిజన్ బెంచ్, పళనిస్వామి అప్పీల్‌ను అనుమతిస్తూ, ఆగస్టు 17న జస్టిస్ జి జయచంద్రన్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను పక్కన పెట్టింది. ఈ క్రమంలో జూన్ 23న జరిగిన సమావేశం చట్టవిరుద్ధమని పేర్కొంటూ యథాతథ స్థితిని కొనసాగించాలని ఇరువర్గాలను ఆదేశించింది.
పళనిస్వామి అగ్రనేతగా..
అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ సమావేశం జూలై 11న జరిగింది. ఈ సమావేశంలో పళనిస్వామిని పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా, అత్యున్నత పదవికి ఎన్నుకున్నారు. అదే సమయంలో, పన్నీర్ సెల్వం పార్టీ నుంచి తొలగించబడ్డారు. దీనికి వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 14న జిల్లా కార్యదర్శి సమావేశం జరిగినప్పటి నుంచి పార్టీలో ఏక నాయకత్వం కోసం చర్చ మొదలైంది. సమస్యను పరిష్కరించేందుకు ఇరువర్గాలు పలు దఫాలుగా చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం