Watch Video: సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రమేశ్‌ విశ్వాస్‌.. వీడియో

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ తన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. డయ్యూలో రమేశ్‌ సోదరుడు అజయ్‌ అంత్యక్రియలు జరిగాయి. విమాన ప్రమాదంలో అజయ్‌ చనిపోగా ఆయన సీటు పక్కనే కూర్చున్న రమేశ్‌ మాత్రం ప్రాణాలతో బయపటపడ్డారు.

Watch Video: సోదరుడి అంత్యక్రియల్లో కన్నీరుమున్నీరైన రమేశ్‌ విశ్వాస్‌.. వీడియో
Ahmedabad Plane Crash

Updated on: Jun 18, 2025 | 5:08 PM

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్‌ కుమార్‌ రమేశ్‌ తన సోదరుడి అంత్యక్రియలకు హాజరయ్యారు. డయ్యూలో రమేశ్‌ సోదరుడు అజయ్‌ అంత్యక్రియలు జరిగాయి. విమాన ప్రమాదంలో అజయ్‌ చనిపోగా ఆయన సీటు పక్కనే కూర్చున్న రమేశ్‌ మాత్రం ప్రాణాలతో బయపటపడ్డారు. సోదరుడి అంత్యక్రియల్లో పాల్గొన్న రమేశ్‌ కుప్పకూలారు. అహ్మదాబాద్‌ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన రమేశ్‌ డయ్యూకు వచ్చారు. జూన్ 12న లండన్‌కు విశ్వాస్‌ కుమార్‌, రమేశ్‌ సోదరులు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 279 మంది ప్రాణాలు కోల్పోయారు. రమేశ్‌ ఒక్కడే ప్రాణాలతో బయటపడ్డాడు. బ్రిటీష్‌ పౌరుడైన రమేశ్‌ తన కుటుంబ సభ్యులను కలిసేందుకు కొద్దిరోజుల క్రితం తన సోదరుడితో కలిసి డయ్యూ వచ్చారు. తిరిగి లండన్‌ వెళ్తుండగా ఎయిర్‌ ఇండియా విమానం కుప్పకూలింది.

అహ్మదాబాద్‌లో జరిగిన వినాశకరమైన ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి రమేష్ విశ్వాస్ కుమార్.. అదే విమానంలో ప్రయాణిస్తున్న తన సోదరుడు అజయ్ మృతిచెందగా.. బుధవారం రమేష్ మృతదేహాన్ని మోసుకెళ్తూ కన్నీరుమున్నీరయ్యారు. వీడియోలో.. రమేష్ ఇంకా కాలిన గాయాల నుంచి కోలుకుంటున్నట్లు కనిపిస్తుంది. తన సోదరుడి శవపేటికను భుజాన మోస్తూ.. రమేష్ తోపాటు కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

వీడియో చూడండి..

బిజె మెడికల్ కాలేజీ హాస్టల్‌లోకి విమానం దూసుకెళ్లిన తర్వాత మంటలు చెలరేగాయి.. ఈ క్రమంలో మంటలు, శిథిలాల నుండి బయటకు వస్తూ రమేష్ కనిపించాడు. తీవ్రమైన గాయాలతో తృటిలో బయటపడ్డాడు.. విమానం కిటీకి నుంచి దూకి రమేష్ ప్రాణాలను కాపాడుకున్నాడు.. అనంతరం సివిల్ ఆసుపత్రికి తరలించి రమేష్ కు చికిత్స అందించగా.. ఇటీవలనే డిశ్చార్జ్ అయ్యాడు..

కాగా.. డీఎన్ఏ పరీక్షల ద్వారా ఇప్పటివరకు 190 మంది ప్రమాద బాధితులను గుర్తించామని, 159 మృతదేహాలను ఇప్పటికే కుటుంబాలకు అప్పగించామని అధికారులు బుధవారం తెలిపారు. 242 మందితో లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా AI-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే కూలిపోయింది.. విమానంలో ఉన్న ఒకరు తప్ప మిగిలిన వారందరూ మరణించారు.. అంతేకాకుండా.. హాస్టల్ లో ఉన్న దాదాపు 38 మంది మెడికోలు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. మరణించిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఉన్నారు..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..