Air India Flight Crash: కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? ఫస్ట్‌ టైం ఇలాంటి..

విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌, ఎక్స్‌ ఖాతాలో తదుపరి అప్‌డేట్‌ ఇస్తామని ఎయిరిండియా తెలిపింది. కాగా, విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న మేఘని నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదంటున్నారు విశ్లేషకులు.. క్రాష్‌ అయిన విమానం ధర ఎంతో తెలిస్తే..

Air India Flight Crash: కూలిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ప్రత్యేకతలు ఏంటో తెలుసా..? ఫస్ట్‌ టైం ఇలాంటి..
Air India Plane Crash

Updated on: Jun 12, 2025 | 5:08 PM

అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్ గాట్విక్‌కు బయలుదేరిన ఎయిరిండియా ఫ్లైట్‌ AI171 గురువారం మధ్యాహ్నం ప్రమాదానికి గురైంది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242 మంది ప్రయాణికులు ఉన్నారని ఎయిరిండియా వెల్లడించింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పింది. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారిక వెబ్‌సైట్‌, ఎక్స్‌ ఖాతాలో తదుపరి అప్‌డేట్‌ ఇస్తామని ఎయిరిండియా తెలిపింది. కాగా, విమానాశ్రయానికి సమీపంలో జనసాంద్రత ఎక్కువగా ఉన్న మేఘని నగర్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదంటున్నారు విశ్లేషకులు.. క్రాష్‌ అయిన విమానం ధర ఎంతో తెలిస్తే..

అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా విమానం సాధారణ విమానం కాదు. ఇది ఎయిర్ ఇండియా అత్యంత ఆధునిక, ఎంతో సాంకేతికను కలిగిన విమానాలలో ఒకటి. ప్రమాదానికి గురైన ఫ్లయిట్‌ నెంబర్‌ AI-171. వైడ్‌ బాడీ బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్‌. ఇది 300 మంది ప్రయాణీకుల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. ఇందులో అతిపెద్ద ఫ్యూయల్‌ ట్యాంక్‌ కలిగి ఉంటుంది. ఒక్కసారి ఫ్యూయల్‌ నింపితే.. 15 వేల కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించ గల సామర్థ్యం కలిగి ఉంటుంది.  దీనిని ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ సుదూర మార్గాల్లో ఉపయోగిస్తుంది. ఈ బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం ఇంధన సామర్థ్యం, ప్రయాణీకులకు మంచి సౌకర్యాన్ని అందించడంలో ప్రసిద్ధి చెందింది.

భారతదేశంలో ఇప్పటివరకు బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం ఉంది. దీనికి బిజినెస్ క్లాస్‌లో 18 సీట్లు, ఎకానమీ క్లాస్‌లో 238 సీట్లు ఉన్నాయి. బిజినెస్ క్లాస్ సౌకర్యాల విషయానికి వస్తే.. ఇది ఫ్లాట్-బెడ్ సీట్లు, ప్రత్యేక చెక్-ఇన్ కౌంటర్, లాంజ్ యాక్సెస్, అధిక-నాణ్యత సౌకర్యాల కిట్‌ను కలిగి ఉంది. ఎకానమీ క్లాస్ విషయానికి వస్తే.. ఇది మంచి ఉష్ణోగ్రత, లైటింగ్ నియంత్రణ, వెరైటీ ఫుడ్స్‌, ఫ్రీ డ్రింక్స్‌ అందుబాటులో ఉంటాయి.

ఇవి కూడా చదవండి

ఈ విమానం ఇదే పరిమాణంలో ఉన్న ఇతర విమానాల కంటే 20శాతం ఎక్కువ ఇంధన సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది ఆధునిక విమానంలో వినోద వ్యవస్థలు, ఎక్కువ స్థలంతో సౌకర్యవంతమైన సీట్లను కలిగి ఉంటుంది. తద్వారా అంతర్జాతీయ ప్రయాణ సమయంలో ఎటువంటి సమస్య ఉండదు. ఎయిర్ ఇండియా 787 డ్రీమ్‌లైనర్ అధునాతన సాంకేతికతతో అమర్చబడి ఉంది. ఇది ప్రయాణీకులకు ప్రతి తరగతిలో సౌకర్యవంతమైన, ఆహ్లాదకరమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుంది.

787-8 విమానంలో 18 బిజినెస్ క్లాస్, 238 ఎకానమీ క్లాస్ సీట్లు ఉంటాయి. అయితే 787-9 మోడల్ 2025 చివరి నాటికి ఎయిర్ ఇండియా విమానంలో చేరాలని షెడ్యూల్‌ చేశారు.. ఏవియేషన్ A2Z ప్రకారం, ఎయిర్ ఇండియా 787-9 మోడల్ కోసం పెద్ద ఆర్డర్‌ను ఇచ్చింది. ప్రస్తుతం మూడు విమానాలు నిర్మాణంలో ఉన్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..