Independence Day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆ వాహనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!

స్వాతంత్య్ర దినోత్సవానికి ఇంకా 12 రోజులే సమయం ఉండడంతో దేశ రాజధాని ఢిల్లీలో ఎలాంటి అవాంచనీయ సంఘటను చోటుచేసుకుండా, ముందస్తు చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఢిల్లీ పోలీసులు.. ఈ మేరకు తాజాగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ భద్రతా ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Independence Day: స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఆ వాహనాలపై పోలీసుల ప్రత్యేక నిఘా!
Delhi Police Independence Day Security

Updated on: Aug 03, 2026 | 7:26 PM

స్వాతంత్య్ర దినోత్సవానికి వేడుకలకు సమయం అసన్నం కావడంతో దేశ రాజధాని ఢిల్లీలో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసే పనిలో పడ్డారు ఢిల్లీ పోలీసలు. ఈ మేరకు శనివారం ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆగస్ట్‌ 15 సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటను చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే గతంలో జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని మళ్లీ అలాంటి ఘటనలు సంభవించకుండా చూడాలన్నారు.

సమావేశంలో కీలక ఆదేశాలు ఇవే

గతంలో జరిగిన దాడులను దృష్టిలో ఉంచుకొని అధికారులకు సీపీ కీలక ఆదేశాలు జారీ చేశారు. 2025 నవంబర్‌లో ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ఒక పాత హ్యుందాయ్ i20 కారును వాడినట్లు గుర్తించిన అధికారులు. ఈ నేపథ్యంలో పాత కార్ల డాక్యుమెంట్ల తనిఖీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరం పరిధిలోని సెకండ్ హ్యాండ్ కార్ల వ్యాపారులపై, వారి వద్ద అమ్మకానికి ఉన్న వాహనాల పత్రాల వెరిఫికేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని అన్ని పోలీస్ స్టేషన్‌ల SHOలకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే దొంగిలించబడిన వాహనాలు సెకండ్ హ్యాండ్ కార్ డీలర్ల ద్వారా అమ్ముడవకుండా చూడాలని స్పష్టం చేశారు.

యూఏపీఏ నిందితులపై కన్ను: చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం కింద కేసులు ఎదుర్కొంటున్న వారిపై, బెయిల్‌పై ఉన్న నేరస్థుల కదలికలపై నిరంతరం కంటకన్ను ఉంచాలని సూచించారు.

కమ్యూనిటీ పోలీసింగ్: సీనియర్ సిటిజన్లు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులతో క్రమం తప్పకుండా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల్లో నమ్మకాన్ని పెంచాలని, కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని కమిషనర్ సూచించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us