Truck Strike: సమ్మెపై ట్రక్కు డ్రైవర్లు కీలక నిర్ణయం.. కేంద్రం చర్చలతో..

హమ్మయ్యా.. ఎట్టకేలకు దేశ వ్యాప్త సమ్మెను విరమించుకున్నారు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు. కేంద్రంతో ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తక్షణమే అమలు చేయడం లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా కీలక ప్రకటన చేశారు. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్‌ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు..

Truck Strike: సమ్మెపై ట్రక్కు డ్రైవర్లు కీలక నిర్ణయం.. కేంద్రం చర్చలతో..
Truck Strike

Updated on: Jan 03, 2024 | 8:04 AM

ట్రక్కు డ్రైవర్ల సమ్మెతో ఒకపూటకే దేశం అల్లకల్లోలమైంది. సమ్మె ఎఫెక్ట్‌తో పెట్రోల్ బంకులు కిటకిటలాడాయి. దేశంలో ప్రధాన నగరాల్లో భారీ ట్రాఫిక్ జామ్‌తో ప్రజలు, వాహనదారులు నరకయాతన పడ్డారు. కేంద్రం జరిపిన చర్చలు సఫలం కావడంతో ఎట్టకేలకు డ్రైవర్లు సమ్మె విరమించారు. ఒక్కసారిగా ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.

హమ్మయ్యా.. ఎట్టకేలకు దేశ వ్యాప్త సమ్మెను విరమించుకున్నారు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు. కేంద్రంతో ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్ల జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కేంద్రం ప్రవేశపెట్టిన హిట్‌ అండ్‌ రన్‌ చట్టాన్ని తక్షణమే అమలు చేయడం లేదని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా కీలక ప్రకటన చేశారు. నిబంధన ఇంకా అమల్లోకి రాలేదని ట్రాన్స్‌ పోర్టు సంఘాలతో విస్త్రృత చర్చలు జరిపిన తర్వాతే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో సంతృప్తి వ్యక్తం చేశారు ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్లు. డ్రైవర్లు వెంటనే విధుల్లో చేరాలని పిలుపునిచ్చారు. దీంతో దేశ ప్రజలంతా ఊపిరిపీల్చుకున్నారు.

అంతకుముందు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్‌ అండ్‌ రన్‌ కేసులకు సంబంధించి తీసుకొచ్చిన కఠిన నిబంధనకు వ్యతిరేకంగా ట్రక్కు డ్రైవర్లు మూడు రోజులపాటు దేశవ్యాప్త నిరసనకు పిలుపునిచ్చారు. దేశంలోని పలు ప్రాంతాల్లో రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. డ్రైవర్ల ఆందోళనతో ట్యాంకర్లు, ట్రక్కులు నిలిచిపోవడంతో పెట్రోల్‌ కొరత ఏర్పడుతుందనే భయంతో వాహనదారులు పెట్రోల్‌ బంక్‌ల వద్దకు భారీ ఎత్తున చేరుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా అనేక చోట్ల భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. హైదరాబాద్‌లో ఐకియా జంక్షన్‌, పంజాగుట్ట, లక్డీకాపూల్, హిమాయత్‌నగర్‌, నాంపల్లి, మియాపూర్‌ సహా అనేక చోట్ల కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్‌ స్థంభించింది. చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకవైపు ట్రాఫిక్, మరోవైపు పెట్రోల్ బంక్‌ లవద్ద ఉద్రిక్త పరిస్థితి కంట్రోల్ చేయలేక పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు.

బంకుల దగ్గర వాహనదారుల ఇబ్బందులు..

 

హిట్‌ అండ్‌ రన్‌ కేసులో గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష, రూ.7లక్షల జరిమానా చెల్లించడం కూడా సాధ్యం కాదని ఆందోళన ట్రక్కులు, లారీలు, ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ జైలు శిక్ష పడితే పదేళ్లపాటు కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని, తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన చెందారు. అందుకే శిక్షతోపాటు జరిమానా కూడా తగ్గించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాదు.. ఈ నిబంధన వల్ల కొత్త వారు ఈ వృత్తిని చేపట్టేందుకు ముందుకు రారని డ్రైవర్ల సంఘాలు చెప్పాయి. అయితే ఎట్టకేలకు కేంద్రత్వరగానే స్పందించడంతో ప్రజలు ఒకపూట ఇబ్బందుల తోనే బయటపడ్డారు. హిట్‌ అండ్‌ రన్‌ కేసుపై పూర్తి స్థాయిలో అధ్యయనంచేశాకే అమలు చేయాలని కోరుతున్నారు ట్రక్కు డ్రైవర్లు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..