Air force plane: వీడిన ఏడేళ్ల మిస్టరీ.. అదృశ్యమైన విమాన జాడ ఇలా దొరికింది.

|

Jan 12, 2024 | 7:11 PM

ఈ ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదాలు జరిగిన సంఘటనలు జరగని నేపథ్యంలో ఐఏఎఫ్‌ కే-2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే 2016 జులై 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఏఎన్‌-32 రవాణా విమానం కే-2743 చెన్నైలోని తాంబరం ఎయిర్‌ ఫోర్స్‌...

Air force plane: వీడిన ఏడేళ్ల మిస్టరీ.. అదృశ్యమైన విమాన జాడ ఇలా దొరికింది.
Plane An 32
Follow us on

2016లో బంగాళాఖాతంలో అదృశ్యమైన ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన విమానం మిస్టరీ వీడింది. సుమారు ఏడేళ్ల తర్వాత తాజాగా ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌కు చెందిన AN-32 రవాణా విమానం శకలాలను శుక్రవారం గుర్తించారు. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో వీటిని గుర్తించారు. వాటి ఫొటోలను పరిశీలించిన తర్వాత ఐఏఎఫ్‌కు చెందిన ఏఎన్‌-32 విమానానికి చెందిన శకలాలుగా నిర్ధారించారు.

ఈ ప్రాంతంలో ఎలాంటి విమాన ప్రమాదాలు జరిగిన సంఘటనలు జరగని నేపథ్యంలో ఐఏఎఫ్‌ కే-2743 విమానం శకలాలుగా భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే 2016 జులై 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఏఎన్‌-32 రవాణా విమానం కే-2743 చెన్నైలోని తాంబరం ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి టేకాఫ్‌ అయ్యింది. ఆ సమయంలో సిబ్బందితో సహా.. 29 మందితో వీకెండ్ ట్రిప్‌లో భాగంగా.. అండమాన్, నికోబార్ దీవులకు బయలుదేరింది. పోర్ట్ బ్లెయిర్‌లోని భారత నౌకాదళ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్‌ ఉత్క్రోష్‌లో విమానం ల్యాండ్ కావాల్సి ఉంది.

అయితే.. టేకాఫ్‌ అయిన కొంతసేపటికే విమానం అదృశ్యమైంది, అనంతరం రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో వెంటనే రంగంలోకి దిగిన సైనిక దళాలు మూడు నెలలపాటు బంగాళఖాతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించింది. అయితే ఎంత ప్రయత్నించిన విమాన ప్రమాదానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లభించలేవు. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న 29 మంది మరణించి ఉంటారని ఐఏఎఫ్‌ ప్రకటించింది. ఇందులో భాగంగానే 2016 సెప్టెంబర్‌ 15వ తేదీన వారి కుటుంబ సభ్యులకు లేఖలు పంపించింది.

ఇదిలా ఉంటే విమానం టేకాఫ్‌ అయిన 16 నిమిషాల తర్వాత పైలట్‌ చివరిసారి కాల్‌ చేసి.. ‘అంతా సాధరణం’ అని తెలిపాడు. అయితే క్రాష్ జరిగిన దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత, కూలిపోయిన విమానం టేకాఫ్‌ అయిన ప్రదేశం నుంచి తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిధిలాలు లభించాయి. ఇక బ్లాక్‌ బాక్స్‌లోని నీటి అడుగున లొకేటర్ బెకన్ అమర్చలేదని, దీంతో విమాన శకలాల కోసం వెతకడం కష్టంగామారిందని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..