
ప్రపంచ వ్యాప్తంగా వరుస భూకంపాలు వణుకుపుట్టిస్తున్నాయి. తాజాగా శనివారం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులో 5.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప ప్రకంపనలు ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం, జమ్మూ కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలు తాకినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంపం మధ్యాహ్నం 12:17 గంటలకు IST వద్ద ఉపరితలం క్రింద 86 కి.మీ లోతులో సంభవించింది. భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్ – తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో ఉంది.
ఇది టెక్టోనిక్ కదలికల కారణంగా భూకంప కార్యకలాపాలకు గురయ్యే ప్రాంతం. కాగా, కశ్మీర్‌లోని పూంచ్ నుండి వచ్చిన వీడియోల్లో భూమి కంపించడం ప్రారంభించిన కొద్ది క్షణాల్లోనే ప్రజలు భవనం నుంచి బయటకు పరుగెత్తుతున్నట్లు కనిపించింది. ఈ భూకంపానికి సంబంధించి, అలాగే సరిహద్దుకు ఇరువైపులా ప్రాణనష్టం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
EQ of M: 5.8, On: 19/04/2025 12:17:53 IST, Lat: 36.10 N, Long: 71.20 E, Depth: 130 Km, Location: Afghanistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/Ar2EoIRFLH— National Center for Seismology (@NCS_Earthquake) April 19, 2025
#WATCH | An earthquake of magnitude 5.8 on the Richter scale hit Afghanistan at 12:17 PM (IST); tremors also felt in parts of Jammu and Kashmir
(Visuals from Poonch) pic.twitter.com/PQP8Ektldi
— ANI (@ANI) April 19, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.