AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోచింగ్‌ సెంటర్స్‌ తప్పుడు ప్రకటనలపై కేంద్రం కన్నెర్ర

ఇకపై పోటీ పరీక్షల ఫలితాల్లో తప్పుడు ప్రకటనలు ఇస్తే ఖతమే!.. అవును.. కోచింగ్‌ సెంటర్స్‌ తప్పుడు ప్రకటనలపై సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ కొరడా ఝుళిపిస్తోంది. దేశంలోని 24 కోచింగ్‌ సెంటర్స్‌పై ఉక్కుపాదం మోపింది. అసలేంటీ.. కోచింగ్‌ సెంటర్ల యాడ్స్‌ దందా?..

కోచింగ్‌ సెంటర్స్‌ తప్పుడు ప్రకటనలపై కేంద్రం కన్నెర్ర
Coaching Centre
Ram Naramaneni
|

Updated on: Apr 19, 2025 | 1:47 PM

Share

వివిధ కోర్సుల ఫలితాలు, ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ల రిజల్ట్స్‌ రానున్న నేపథ్యంలో పలు కాలేజ్‌లు, కోచింగ్‌ సెంటర్లు యాడ్స్‌ ఇస్తుంటాయి. టాప్‌ టెన్‌లో అన్ని ర్యాంకులు, ఇన్ని ర్యాంకులు వచ్చాయని.. ఆ ర్యాంకులు మావే.. ఈ ర్యాంకులు మావే అని హోరెత్తిస్తుంటాయి. అయితే.. కొన్ని కోచింగ్ సెంటర్లు, సంస్థలు తప్పుడు ప్రకటనలు ఇవ్వడంపై సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ యాక్షన్‌ తీసుకుంటోంది. ప్రధానంగా.. IIT-JEE, NEET, UPSC లాంటి పోటీ పరీక్షల ఫలితాల్లో కొన్ని కోచింగ్‌ సెంటర్స్‌ ఫేక్‌ యాడ్స్‌ ఇచ్చినట్లు గుర్తించింది. తప్పుడు ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న కోచింగ్ సెంటర్స్‌పై వినియోగదారుల రక్షణ చట్టం-2019ని ప్రయోగించింది. ఫేక్స్‌ యాడ్స్‌ ఇస్తున్న దేశంలోని 24 కోచింగ్ సెంటర్లకు నోటీసులు జారీ చేయడంతోపాటు.. 77లక్షల 60వేల జరిమానా విధించింది.

పోటీ పరీక్షల ఫలితాల విడుదల తర్వాత తప్పుదారి పట్టించే ప్రకటనలు జారీ చేస్తే తాట తీస్తామని CCPA మరోసారి హెచ్చరించింది. అన్ని కోచింగ్‌ సెంటర్లు రూల్స్‌ ఖచ్చితంగా పాటించాలని సూచించింది. కోచింగ్‌ సెంటర్స్‌ యాడ్స్‌లో అభ్యర్థి పేరు, ర్యాంక్, కోర్సు లాంటి కీలక వివరాలను క్లారిటీగా ప్రకటించాల్సిందేనని ఆదేశించింది. గతంలోనూ ఫేక్‌ యాడ్స్‌ జారీ చేసిన కోచింగ్‌ సెంటర్లకు సెంట్రల్‌ కన్జ్యూమర్‌ ప్రొటక్షన్‌ అథారిటీ జరిమానా విధించింది. మూడు కోచింగ్‌ సెంటర్లకు ఒక్కోదానికి ఏడు లక్షల రూపాయల చొప్పున ఫైన్‌ వేసింది. మరో కోచింగ్‌ సెంటర్‌కు లక్ష జరిమానా విధించింది. మొత్తంగా.. త్వరలో పలు ఎంట్రాన్స్‌ ఎగ్జామ్‌ల రిజల్ట్స్‌, పోటీ పరీక్షల ఫలితాలు రిలీజ్‌ కానున్న వేళ కోచింగ్‌ సెంటర్లను CCPA హెచ్చరిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

Follow Us
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
ఆ భూములను రైతులకు, అమరవీరుల కుటుంబాలకు ఇవ్వండి: సీఎం
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
16 బౌండరీలతో అయ్యర్ విధ్వంసం.. ఒకే దెబ్బకు 4 రికార్డులు బ్రేక్
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
ఆర్బీఐ బిగ్ అనౌన్స్‌మెంట్‌కు అంతా రెడీ..
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
భరించలేని ఎముకల నొప్పులు ఉన్నాయా? కప్పు రాగి పిండితో ఇలా
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
చందనం తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీని వెనుక ఉన్న రహస్యం తెలుసా?
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
25ఏళ్ల పాలనాప్రస్థానం పూర్తి.. వినాయకుడి సన్నిధిలో PM మోదీ పూజలు
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రజత్ పటిదార్ హాఫ్ సెంచరీ వృథా.. తొలి వన్డేలో ఇండియా-ఎ ఘోర పరాజయం
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
రైతులకు కేంద్రం దసరా కానుక.. అకౌంట్లోకి రూ.2 వేలు అప్పుడే..!
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
4 గుర్రాలను ముగ్గురు అన్నదమ్ములు ఎలా పంచుకోవాలి.. చిక్కుప్రశ్న
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..
అమ్మవారికి చేపల నైవేద్యం.. 200 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం..