Aero India 2021: ఏరో ఇండియా కార్యక్రమం బిలియన్ అవకాశాలకు రన్‌వే అంటూ ట్వీట్ చేశారు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకూ బెంగుళూరులో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది చాలా వినూత్నమైన కార్యక్రమమని అనేక అవకాశాలకు రహదారని పేర్కొన్నారు. అంతేకాకుండా కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడియోను సోషల్‌మీడియాలో విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారుతోంది.
ది ఏరో ఇండియా కార్యక్రమంలో వివిధ ఏరోస్పేస్ కంపెనీలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం బెంగళూరులోని యెలహంక ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో జరగనుంది. కరోనా వల్ల పాల్గొనే ప్రతినిధులు వారి ఉత్పత్తులను వర్చువల్‌గా ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్ రిపోర్టును సమర్పించాలని నిర్వాహకులు వెల్లడించారు. ఇందులో ప్రారంభోత్సవం రోజున 41 ఎయిర్ క్రాఫ్ట్‌లు ప్రదర్శించనున్నట్లు తెలిపారు. మరో 63 ఎయిర్‌క్రాఫ్ట్‌లు డిస్‌ప్లేలో ఉంటాయన్నారు. వీటిల్లో సూర్యకిరణ్ ఎయిర్ క్రాఫ్ట్, సారంగ్ హెలికాఫ్టర్లు ప్రధానాకర్షణగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ‘ఆత్మనిర్భర్ ఫార్మేషన్ విమానాన్ని’ ప్రదర్శించనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా సుఖోయ్, అడ్వాన్డ్స్ లైట్ హెలికాఫ్టర్ ధ్రువ్ వంటి చాలా విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు తెలిపారు.
The @AeroIndiashow is scheduled from 3rd Feb till 5th Feb,21 at Bengaluru. The event is unique in ways more than one and it is billed as the ‘Runway to a Billion opportunities’
For virtual free registration, follow the link given below. #AeroIndia2021 https://t.co/hgvpPBOOEd pic.twitter.com/nASYDS0qyQ
— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) January 29, 2021