Adenovirus scare in Bengal: పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోన్న మరో డేంజర్‌ వైరస్.. హైఅలర్ట్‌ ప్రకటించిన సర్కార్!

పశ్చిమ బెంగాల్‌ను మరో వైరస్‌ వణికిస్తోంది. అడెనో వైరస్‌ విజృంభించడంతో చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఆస్పత్రుల పాలవుతున్నారు. నెల రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో..

Adenovirus scare in Bengal: పశ్చిమ బెంగాల్‌ను వణికిస్తోన్న మరో డేంజర్‌ వైరస్.. హైఅలర్ట్‌ ప్రకటించిన సర్కార్!
Adenovirus

Updated on: Feb 20, 2023 | 9:42 PM

పశ్చిమ బెంగాల్‌ను మరో వైరస్‌ వణికిస్తోంది. అడెనో వైరస్‌ విజృంభించడంతో చిన్నారులతో పాటు పెద్దలు కూడా ఆస్పత్రుల పాలవుతున్నారు. నెల రోజుల్లో కేసుల సంఖ్య బాగా పెరిగిపోవడంతో హైఅలర్ట్‌ ప్రకటించారు. అడెనో వైరస్ ప్రభావంతో పలువురు చిన్నారులతో పాటు పెద్దలు కూడా అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో బెంగాల్‌ ప్రభుత్వం అప్రమత్తమైంది. చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా అధికారులకు జిల్లాలకు రాష్ట్ర ఆరోగ్యశాఖ సూచించింది. చిన్న పిల్లల్లో ఫ్లూ లాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే తగిన చికిత్స అందించాలని ఆదేశించింది.

బెంగాల్‌లో గత జనవరి నుంచి అడెనో వైరస్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం ఒక్క రోజే 115 మంది పేషెంట్లు ఈ వైరస్ కారణంగా ఆస్పత్రుల్లో చేరారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. చాలా మంది నాన్ కోవిడ్ కరోనా వైరస్, ఇన్‌ఫ్లుయెంజా, పారా ఇన్‌ఫ్లుయెంజా, రైనో వైరస్, న్యూమోకాకస్ అండ్ ఆర్ఎస్‌వీ వంటి లక్షణాలతో బాధపడుతున్నట్లు వైద్య శాఖ తెలిపింది. అడెనో వైరస్ కారణంగా చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అడెనో వైరస్ సోకిన వారిని కూడా కోవిడ్ మాదిరిగానే స్వాబ్ ద్వారా పరీక్షించి, ట్రీట్‌మెంట్‌ చేస్తారు. అడెనో వైరస్ సోకితే ప్రధానంగా కళ్లు ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. శ్వాస వ్యవస్థ, మూత్ర వ్యవస్థ, ఊపిరితిత్తులు, పేగులపై ఈ వైరస్‌ ప్రభావం ఉంటుంది. డయేరియా కూడా రావొచ్చు. చిన్నారులు త్వరగా, ఎక్కువగా వైరస్ బారిన పడుతున్నా వెంటనే ఆస్పత్రిలో చేర్పించాలని బెంగాల్‌ ఆరోగ్యశాఖ సూచించింది

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us