భారతదేశం ఇటీవల ఓ అరుదైన జాబితాలో చోటు సంపాదించింది. స్వతంత్ర ప్రాంతీయ నావిగేషన్ శాటిలైట్ సిస్టం (ఐఆర్ఎన్ఎస్ఎస్) కలిగిన నాలుగో దేశంగా అవతరించింది. ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంవో) కూడా దీనిని నిర్ధారించింది. ఈ నావిగేషన్ సిస్టమ్‌ను హిందూ మహాసముద్రంలో తిరిగే ఓడల్లో వాడుతారు. ఇంతవరకు వాడుతున్న నావిగేషన్ సిస్టంను ఇప్పుడు ఇండియన్ రీజనల్ నావిగేషన్ సిస్టం మార్చనుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ డెవలప్ చేసిన ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్‌కు గుర్తింపు రావడానికి రెండేళ్ల సమయం పట్టింది. దీని ద్వారా హిందూ మహా సముద్రంలో ప్రయాణించే వాణిజ్య ఓడలు కచ్చితమైన నావిగేషన్ వ్యవస్థను వినియోగించుకోవచ్చు.
అయితే ఇప్పటి వరకు భారతీయులు అమెరికా రూపొందించిన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్‌ను వాడుతున్నారు. ఐఆర్ఎన్ఎస్ఎస్ వ్యవస్థ రూపొందించడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఏకంగా 8 శాటిలైటన్లను లాంచ్ చేసింది. ఇది ఇండియా స్వతంత్రంగా అభివృద్ధి చేసుకున్న ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ. ఇది భారత సరిహద్దు వెంబడి 1500 కిలీమీటర్ల మేర పనిచేస్తుంది. సముద్రంలో తిరిగే ఓడలకు కచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతేకాదు సముద్రంలో పొంచి ఉన్న ప్రమాదాలను పసిగడుతుంది. ఈ నావిగేషన్ సిస్టం ద్వారా ప్రపంచ దేశాల్లో భారతదేశానికి మంచి గుర్తింపు లభించింది.