కేజ్రీకి భారీ షాక్.. అన్ని స్థానాల్లో ఓటమే.. నోటా కంటే తక్కువే..

దేశ వ్యాప్తంగా పాగ వేద్దామని పార్టీ ప్రారంభించింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ తీరు చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని ఆ పార్టీ ఏలుతోంది. అయితే అటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో కూడా కాస్త ప్రభావం ఉంది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఊహించని విధంగా పార్టీకి షాకులు తగులుతున్నాయి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ […]

కేజ్రీకి భారీ షాక్.. అన్ని స్థానాల్లో ఓటమే.. నోటా కంటే తక్కువే..
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 5:25 AM

దేశ వ్యాప్తంగా పాగ వేద్దామని పార్టీ ప్రారంభించింది. కానీ ప్రస్తుతం ఆ పార్టీ తీరు చూస్తే షాక్ తినాల్సిందే. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీని ఆ పార్టీ ఏలుతోంది. అయితే అటు పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో కూడా కాస్త ప్రభావం ఉంది. ఇక ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ తమ పార్టీ తరఫున అభ్యర్థులను నిలుపుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఊహించని విధంగా పార్టీకి షాకులు తగులుతున్నాయి. అదే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇటీవల జరిగిన మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ రంగంలోకి దిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ రాష్ట్రాల్లో బోణీ కొట్టాలని బరిలోకి దిగితే.. ఊహించని ఫలితాలను చూసింది.

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో.. కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మహారాష్ట్రలో 24 స్థానాల్లో, హర్యానాలో 46 స్థానాల్లో పోటీ చేసింది. అయితే మొత్తం 70 సీట్లలో ఆప్ అభ్యర్థులు ఓటమిపాలయ్యారు. అయితే పోటీ ఇచ్చి ఓడితే ఎవరూ పట్టించుకోపోయేవారు. కానీ నోటా కంటే తక్కువ ఓటింగ్ శాతం రావడం గమనార్హం. హర్యానాలో ఆ పార్టీకి 0.48 శాతం ఓట్లు రాగా.. నోటాకు 0.53 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక మహారాష్ట్రలో నోటాకు 1.37 శాతం ఓట్లు రాగా.. ఆప్‌కు కేవలం 0.11 శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి. పోటీ చేసిన చాలా మంది అభ్యర్థులు కనీసం నాలుగు అంకెల ఓట్లను కూడా రాబట్టలేకపోయారు.