ఆధార్ కార్డుల్లో మార్పులు.. బంధుత్వాలకు మంగళం!

| Edited By:

Feb 10, 2020 | 2:36 PM

ఆధార్ కార్డుల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి బంధుత్వాలకు మంగళం పాడుతున్నట్టు సమాచారం. ఇకపై ఆధార్ కార్డులపై తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ ఉండకపోవచ్చు. వీటి స్థానంలో కేరాఫ్‌ అడ్రస్‌ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఆయా కార్డుల్లో కేరాఫ్ సన్నాఫ్, వైఫ్ ఆఫ్, డాడర్‌ ఆఫ్ అని నమోదు చేసేవారు. ఇప్పుడు వాటిని తొలగించి కొత్తగా అడ్రస్ కేరాఫ్ అన్నదానిని తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం. ఇక నుంచి కొత్త కార్డు […]

ఆధార్ కార్డుల్లో మార్పులు.. బంధుత్వాలకు మంగళం!
Follow us on

ఆధార్ కార్డుల్లో మళ్లీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇక నుంచి బంధుత్వాలకు మంగళం పాడుతున్నట్టు సమాచారం. ఇకపై ఆధార్ కార్డులపై తండ్రి పేరు కానీ, భర్త పేరు కానీ ఉండకపోవచ్చు. వీటి స్థానంలో కేరాఫ్‌ అడ్రస్‌ని తీసుకురావాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటివరకూ ఆయా కార్డుల్లో కేరాఫ్ సన్నాఫ్, వైఫ్ ఆఫ్, డాడర్‌ ఆఫ్ అని నమోదు చేసేవారు. ఇప్పుడు వాటిని తొలగించి కొత్తగా అడ్రస్ కేరాఫ్ అన్నదానిని తీసుకురానుంది కేంద్ర ప్రభుత్వం.

ఇక నుంచి కొత్త కార్డు తీసుకున్నా లేక పాత కార్డును అప్‌డేట్ చేసుకున్నా ఆటోమెటిక్‌గా ఈ మార్పు జరుగుతుందట. తల్లిదండ్రులు, భర్తల పేర్లతో సంక్షేమ పథకాల అమలు, కోర్టు కేసులు, ఆస్తి వివాదాలకూ ఇబ్బంది కలుగుతుండగా.. ఫలానా వ్యక్తి మా తండ్రో లేక భర్తో అని నిరూపించుకోవాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. దీనివల్ల ఆ స్థానంలో కేరాఫ్‌ని తీసుకురావాలని ప్రభుత్వం అనుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా ఇదే విధానం పాన్‌ కార్డుల్లో కూడా వర్తించనున్నారట. అయితే ఈ మార్పులపై మాత్రం ఆధార్ కార్డు నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు.