బాప్‌రే..! ఒకరు, ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి.. వైరల్‌ ఫోటోలు చూస్తే అవాక్కే..

|

May 23, 2023 | 9:38 PM

మొత్తం ఐదుగురు పిల్లలు రిమ్స్ ఆసుపత్రి సంరక్షణలో ఉన్నారు. పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, "వారి తల్లి ఈ పిల్లలను ఎలా పెంచుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఈ పిల్లల బాధ్యత తీసుకోవాలి." అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి.

బాప్‌రే..! ఒకరు, ఇద్దరు కాదు.. ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి.. వైరల్‌ ఫోటోలు చూస్తే అవాక్కే..
Baby
Follow us on

జార్ఖండ్‌లోని రాంచీలో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ ఒకరు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చింది. ఇక్కడ మరో విషయం ఏంటంటే..తల్లి సహా ఐదుగురు శిశువులు కూడా క్షేమంగా ఉన్నారని డాక్టర్ చెప్పారు. అయితే, ఈ పిల్లలు నెలలు నిండకుండానే జన్మించడం వల్ల వారిపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మహిళ ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన వార్త విని అందరూ షాక్ అయ్యారు. జార్ఖండ్‌ రాంజీలోని రిమ్స్ ఆసుపత్రిలో ఓ మహిళ ఒకేసారి ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. ఈ పిల్లలందరి బరువు సుమారు 1 కిలో నుండి 750 గ్రాముల వరకు ఉన్నట్టుగా చెప్పారు. నవజాత శిశువులను నియోనాటాలజీ విభాగంలో చేర్చారు. ఈ ఘటనపై రిమ్స్‌ ఓ ట్వీట్‌ ద్వారా తెలియజేసింది.

రిమ్స్ ఆసుపత్రి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా ఒకే కాన్పులో జన్మించిన ఐదుగురు పిల్లల ఫోటోను షేర్‌ చేసింది. ఒక గర్భిణీ రిమ్స్ ప్రసూతి విభాగంలో ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చింది. శిశువులు ఎన్‌ఐసీయూలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. డాక్టర్ శశిబాలా సింగ్ నేతృత్వంలో ఆ గర్భిణీకి డెలివరీ చేశారు. అంటూ పేర్కొన్నారు. కాగా, ఈ వార్త విని చాలా మంది షాక్ అవుతున్నారు. కొందరు ఆ తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఈ ఘటన తర్వాత చాలా మంది రకరకాలుగా స్పందించారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు, “అద్భుతమైన అనూహ్యమైన, నమ్మశక్యం కాని, అద్భుతం! జార్ఖండ్‌లోని అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక దేవత 5 పిల్లలకు జన్మనిచ్చింది. మొత్తం ఐదుగురు పిల్లలు రిమ్స్ ఆసుపత్రి సంరక్షణలో ఉన్నారు. పిల్లలందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మరొక వినియోగదారు ఇలా వ్రాశారు, “వారి తల్లి ఈ పిల్లలను ఎలా పెంచుతుంది, జార్ఖండ్ ప్రభుత్వం ఈ పిల్లల బాధ్యత తీసుకోవాలి.” అతని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలి. ఆసుపత్రి ట్వీట్లపై నెటిజన్లు ఇలాంటి అనేక భిన్నమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ లింక్ క్లిక్ చేయండి..