Grand mother Video: నానమ్మతో మామూలుగా ఉండదు.. ఆటపట్టిద్దామనుకున్న మనుమడికి ఇచ్చి పడేసింది.. క్యూట్ వీడియో..

|

Nov 17, 2022 | 1:48 PM

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఆ సందడే వేరు. అమ్మమ్మ గానీ నానమ్మతో గానీ ఏర్పడిన పరిచయం చాలా గాఢానుబంధానికి దారి తీస్తుంది. వారితో కలిసి ఆడుకోవడం, కథలు చెప్పించుకోవడం అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వారికి..

Grand mother Video: నానమ్మతో మామూలుగా ఉండదు.. ఆటపట్టిద్దామనుకున్న మనుమడికి ఇచ్చి పడేసింది.. క్యూట్ వీడియో..
Grand Mother Funny Video
Follow us on

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే ఆ సందడే వేరు. అమ్మమ్మ గానీ నానమ్మతో గానీ ఏర్పడిన పరిచయం చాలా గాఢానుబంధానికి దారి తీస్తుంది. వారితో కలిసి ఆడుకోవడం, కథలు చెప్పించుకోవడం అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వారికి కూడా తమ మనుమలు, మనమరాలి పట్ల ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రేమ ఇంట్లో ఉన్న అన్ని రకాల బంధాల కంటే గొప్ప అనుభూతిని ఇస్తుంది. సోషల్ మీడియాలో నిత్యంవేల సంఖ్యలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని ఎమోషనల్ అయితే, మరికొన్ని ఎమోషనల్ కామెడీ కలిసి ఉంటాయి. పెద్దవాళ్లు ఉండే ఇళ్లల్లోని పిల్లలు అమ్మమ్మ గానీ నానమ్మతో గానీ తీపి సంభాషణ కొనసాగించడాన్ని మీరు చూసే ఉంటారు. వారితో జోక్ చేయడం, ఆట పట్టించడం చాలా కామన్ గా జరిగిపోయే విషయాలు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో మనవడు కెమెరా ఆన్ చేసి తన నానమ్మను కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. నువ్వు నా సోదరుడి కోసం ప్రార్థించావు కాబట్టి అతను నాకు సోదరుడు అయ్యాడు. అప్పుడు మా అమ్మ నా సోదరి కోసం ప్రార్థించింది, కాబట్టి ఆమె పుట్టింది. మరి నా కోసం ఎవరు ప్రార్థించారు అని అడుగుతాడు. ఈ ప్రశ్నకు ఆమె వెంటనే తడుముకోకుండా సమాధానం చెప్పింది. నీ కోసం ఎవరూ ప్రార్థించలేదని, అయినా నువ్వు జన్మించావని మనవడిని ఆటపట్టిస్తుంది. నానమ్మ సమాధానం విన్న మనవడు చిన్నబుచ్చుకుంటాడు. ఈ ఫన్నీ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియోన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌లో పోస్ట్ అయింది. నానమ్మతో గొడవ పడకండి అని ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ వీడియోకు 15 వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా వందల మంది లైక్ చేశారు. ఈ సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ వీడియోను నెటిజన్లు విపరీతంగా లైక్ చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..