పాపం.. ఈ భర్త కష్టం పగవాడికి కూడా రాకూడదు.. భార్య కొడుతోందని ఏకంగా మోడీకే కంప్లైంట్..

భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం చాలా సాధారణమైన విషయం. భర్త కొడుతున్నాడని భార్య, భార్య తన మాట వినడం లేదని భర్త.. ఇలా ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకోవడం మనం ఎన్నో చూశాం. పెద్ద మనుషుల..

పాపం.. ఈ భర్త కష్టం పగవాడికి కూడా రాకూడదు.. భార్య కొడుతోందని ఏకంగా మోడీకే కంప్లైంట్..
Complaint To Pm Modi

Updated on: Nov 02, 2022 | 4:07 PM

భార్యాభర్తలు అన్నాక గొడవలు జరగడం చాలా సాధారణమైన విషయం. భర్త కొడుతున్నాడని భార్య, భార్య తన మాట వినడం లేదని భర్త.. ఇలా ఒకరిపై మరొకరు కంప్లైంట్ చేసుకోవడం మనం ఎన్నో చూశాం. పెద్ద మనుషుల దగ్గరో, పోలీస్ స్టేషన్ లోనో, లేదా కోర్టులోనో తమకు న్యాయం చేయాలని కోరుకుంటారు. చాలా వరకు వారు కలిసి ఉండేలా తీర్పు ఇవ్వడమో లేక మానసికంగా కౌన్సిలింగ్ ఇస్తుంటారు. అయితే.. ఇప్పుడు జరిగిన ఓ గమ్మత్తైన ఇన్సిడెంట్ మీకు తప్పకుండా నవ్వు తెప్పిస్తుంది. ఇదీ ఓహెరాస్ మెంట్ కేసే. కానీ భార్యను భర్త వేధిస్తున్నాడనుకుంటే పొరపాటే. ఇక్కడ సీన్ రివర్స్ అయింది. భార్యే భర్తను వేధించడం మొదలెట్టిందని బాధితుడు వాపోయారు. ఇక ఆమె నుంచి బయటపడేందుకు ఏకంగా ప్రధాని మోడీ కే కంప్లైంట్ చేశాడు. భార్య తనను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయమై ఏకంగా ప్రధాన మంత్రి కార్యాలయానికే ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో పీఎంఓను, న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజు, బెంగళూరు పోలీస్ కమిషనర్​ను ట్యాగ్ చేశాడు. ఈ పోస్ట్ పై స్పందించిన కమిషనర్..​అతనికి సహాయం చేస్తానని చెప్పారు. అయితే ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

బెంగళూరుకు చెందిన యదునందన్ ఆచార్య.. తన భార్యపై పీఎంఓకు ఫిర్యాదు చేశాడు. తరచూ తనను వేధిస్తోందని, చేయి చేసుకుంటోందని ట్విట్టర్​లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. ఆమె నుంచి ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశాడు. దయచేసి తనకు న్యాయం జరిగేలా చూడాలని కోరాడు. “నాకు ఎవరైనా సహాయం చేస్తారా? నా భార్య నాపై కత్తితో దాడి చేసింది. మీరు అంటున్న నారీ శక్తి ఇదేనా? దీని కోసం నేను ఆమెపై గృహ హింస కేసు పెట్టవచ్చా? లేదు కదా!” అని యదునందన్​ ట్విట్టర్​లో పోస్ట్ ​చేశాడు.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని జాతీయ వార్తల కోసం..