జ్యోతిష్యుడి సలహా విని నాలుక కోల్పోయిన రైతు..! తృటిలో పెను ప్రమాదం.. అసలు ఏమందంటే..

|

Nov 26, 2022 | 4:23 PM

జ్యోతిష్కుడు చెప్పినట్టుగానే రాజా నాగాలయానికి వెళ్లి అన్ని పూజలు కూడా పూర్తిచేశాడు. అయితే, పూజ ముగింపులో పాము ముందు తన నాలుకను మూడుసార్లు బయటపెట్టాడు రాజా.

జ్యోతిష్యుడి సలహా విని నాలుక కోల్పోయిన రైతు..! తృటిలో పెను ప్రమాదం.. అసలు ఏమందంటే..
Snake Facts
Follow us on

జ్యోతిష్యుడి సలహా విన్న ఒక రైతు నాలుక కోల్పోయాడు. కపిశెట్టిపాళ్యంకు చెందిన రాజా (54) అనే వ్యక్తి నాలుకపై పాము కాటు వేసింది. ఈ ఘటన తమిళనాడులోని ఈరోడ్‌లో చోటుచేసుకుంది. కపిచెట్టిపాళ్యంకు చెందిన 54 ఏళ్ల రాజా తనను పాము కాటు వేసినట్లు పదే పదే కలలు వస్తున్నాయని జ్యోతిష్యుడిని సంప్రదించాడు. చెడు కలలు పోవాలంటే నాగుల గుడికి వెళ్లి కొన్ని పూజలు చేయమని జ్యోతిష్యుడు రైతుకు సలహా ఇచ్చాడు. జ్యోతిష్యుడి సలహా ప్రకారం.. రైతు గుడికి వెళ్లి పూజలు చేసాడు.

జ్యోతిష్కుడు చెప్పినట్టుగానే రాజా నాగాలయానికి వెళ్లి అన్ని పూజలు కూడా పూర్తిచేశాడు. అయితే, పూజ ముగింపులో పాము ముందు తన నాలుకను మూడుసార్లు బయటపెట్టాడు రాజా. దీంతో విషపూరితమైన రస్సెల్స్ వైపర్ రెప్పపాటులో అతడి నాలుకపై కాటువేసింది. అది గమనించిన ఆలయ పూజారి వెంటనే స్పందించాడు. వెంటనే రాజా నాలుకను కత్తిరించాడు. హుటాహుటిన దగ్గరలో ఉన్న ఎరోడ్ మణియన్ మెడికల్ సెంటర్‌కు తరలించాడు. దీంతో అదృష్టంకొద్దీ రాజా ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం అతడికి చికిత్స అందుతోంది.

వైద్యం అందిస్తున్నట్టు హాస్పిటల్ ఎండీ సెంథిల్ కుమారన్ వివరించారు. రాజాకు నాలుక కోసినందుకు వైద్యులు చికిత్స చేసినట్టుగా చెప్పారు. పాముకాటుకు గురవ్వడంతో యాంటీడాట్ కూడా ఇచ్చినట్టు చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి