అసోంలో వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం..

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏకంగా 4 జిల్లాల్లోని 99 గ్రామాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో..

అసోంలో వరద బీభత్సం.. 99 గ్రామాలు జలమయం..

Edited By:

Updated on: Jun 24, 2020 | 1:08 PM

అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఏకంగా 4 జిల్లాల్లోని 99 గ్రామాలను అతలాకుతలం చేశాయి. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద ఎత్తున వరదలు రావడంతో.. 99 గ్రామాలు ముంపుకు గురయ్యాయి. వరదల దాటికి ఒకరు మరణించినట్లు అసోం రాష్ట్ర అధికారులు తెలిపారు. వరద నీరులో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే 36 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. దీహాజీ, శివసాగర్‌, దిబ్రూఘఢ్‌, జోర్హాట్‌ జిల్లాల్లో దాదాపు 4.3వేల హెక్టార్ల పంట నీటమునిగిందన్నారు. నాలుగు జిల్లాలకు కలిపి ప్రస్తుతం 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద బాధితులందరికీ ఇక్కడే షెల్టర్ ఏర్పాటు చేశారు. ఇక ఈ పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి ఆహార సరఫరాకు 21 కేంద్రాలను ఏర్పాటు చేసిన్నట్లు అధికారులు ప్రకటించారు.  భారీ వర్షాలు కురుస్తుంటంతో.. రాష్ట్రంలోని నదులన్నీ పొంగిపొర్లుతున్నాయి.