Viral News: 87 ఏళ్ల భార్యపై భర్త శృంగార వేధింపులు.. భరించలేని ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..

Viral News: గుజరాత్‌లోని వదోదరలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన భర్త శృంగారం విషయంలో వేధిస్తున్నాడని ఓ భార్య భార్య హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. అయితే ఆ భర్త వయసు 89 ఏళ్లు, మహిళ వయసు 87 ఏళ్లు కావడంతో..

Viral News: 87 ఏళ్ల భార్యపై భర్త శృంగార వేధింపులు.. భరించలేని ఆ వృద్ధురాలు ఏం చేసిందంటే..
Representative Image

Updated on: Sep 13, 2022 | 12:36 PM

Viral News: గుజరాత్‌లోని వదోదరలో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. తన భర్త శృంగారం విషయంలో వేధిస్తున్నాడని ఓ భార్య భార్య హెల్ప్‌లైన్‌ను ఆశ్రయించింది. అయితే ఆ భర్త వయసు 89 ఏళ్లు, మహిళ వయసు 87 ఏళ్లు కావడంతో ఈ విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. శృంగారం తన భర్త పదేపదే డిమాండ్‌ చేస్తున్నాడని, దానిని నేను భరించలేకపోతున్నానని వృద్ధురాలు ‘181 అభయం’ హెల్ప్‌లైన్‌ సెంటర్‌లో ఫిర్యాదు చేసింది.

ఈ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌ చేసిన ఆమె.. భర్త శృంగారం విషయంలో తనను ఇబ్బంది పెడుతున్నాడని, అనారోగ్యంతో ఉన్నానని, అలసటగా ఉందని చెప్పినా వినడం లేదని 181 అభయం నిర్వాహకులతో సదరు వృద్ధ మహిళ వాపోయింది. దీంతో సమాచారం తెలుసుకున్న అభయం సభ్యులు వెంటనే సదరు వృద్ధ జంట ఇంటికి చేరుకుంది. అనంతరం వృద్ధుడికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

అలాంటి కోరికలను ఎలా అధిమగమించాలన్న దానిపై వివరించారు. యోగా చేయాలని, ప్రార్థన మందిరాలను సందర్శించాలని తెలిపారు. అంతేకాకుండా గార్డెన్లు, పార్కులను సందర్శించడం ద్వారా ఆ ఆలోచనలను ఇతర అంశాలపైకి మళ్లించుకోవాలని అతనికి సూచించారు. దీంతో ఈ అంశం కాస్త ప్రస్తుతం స్థానికంగా వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..