AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

80th Independence Day Live Updates: చరిత్రలో తొలిసారి జాతీయ గేయం ఆలపించాం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!

80th Independence Day Live Updates Telugu: 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. ఢిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోటపై ప్రధాని మోదీ జాతీయ జెండా ఆవిష్కరించి, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వందేమాతరం 150 ఏళ్ల వేడుకలు, విసిత్ భారత్ లక్ష్యంగా యువశక్తి ప్రాధాన్యతను ఈ వేడుకల్లో ప్రత్యేకంగా హైలైట్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది.

80th Independence Day Live Updates: చరిత్రలో తొలిసారి జాతీయ గేయం ఆలపించాం.. ప్రధాని మోదీ సంచలన ప్రసంగం!
Indias 80th Independence Day Celebrations At Redport
Anand T
|

Updated on: Aug 15, 2026 | 2:01 PM

Share

దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయిజ. ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 13వ సారి జాతీయజెండా ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా దేశ ప్రజలకు మొత్తం ఆయన స్వాతంత్ర్య దినోత్సవ శుభకాంక్షలు తెలిపారు. అయితే ఈ సారి దేశ చరిత్రలోనే తొలిసారి జాతీయ గీతం కంటే ముందుగా జాతీయ గేయమైన వందేమాతారాన్ని ఆలపించారు.

ఈ సందర్భంగా జాతిని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ మాట్లాడారు. దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు మోదీ. స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్నారు. తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించామన్నారు మోదీ. దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోందని.. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందన్నారు. ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోందని.. మనం పెద్ద పెద్ద కలలు కనాలని ఆయన అన్నారు.

ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలని.. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలని కల ఉందన్నారు. భారత్‌ వైపు ప్రపంచం చూస్తోందని.. 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారన్నారు. భారత్‌ వేగంగా అభివృద్ధి చెందే దేశమని..140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యమని ప్రధా మోదీ అన్నారు. వికసిత్‌ భారత్‌ కోసం ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లాలని.. ఆత్మ నిర్భార్‌ భారత్‌గా ఎదగాలన్నారు ప్రధాని మోదీ. మెకిన్‌ ఇండియా, స్వదేశీ, ఓకల్‌ ఫర్‌ లోకల్‌ను దేశ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు.

మోదీ ప్రసంగం ఇక్కడ చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 15 Aug 2026 11:00 AM (IST)

    తిరుపతి పరేడ్‌ గ్రౌండ్స్‌లో స్వాతంత్ర్య వేడుకలు

    స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి ఆనంకు అస్వస్థత
    స్టేజిపై కుప్పకూలిన మంత్రి ఆనం రాంనారాయణ
    బీపీ డౌన్‌ అయినట్టు గుర్తించిన వైద్యులు
    ఆనం ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
  • 15 Aug 2026 10:59 AM (IST)

    తెలంగాణ రక్షణ సేన ఆఫీసులో స్వాతంత్ర్య వేడుకలు

    జాతీయ జెండా ఎగురవేసిన కల్వకుంట్ల కవిత
    బ్రిటిష్ కాలం నాటి ఆలోచనలు వీడాలి-కవిత
    మన చరిత్రను మనం తెలుసుకోవాలి..
    మన పూర్వీకుల పోరాటాన్ని పిల్లలకు వివరించాలి-కవిత
  • 15 Aug 2026 10:12 AM (IST)

    ఆగస్టు 15 మన చరిత్రను గుర్తు చేసే రోజు: మంత్రి లోకేష్

    ఆగస్టు 15 మన చరిత్రను గుర్తు చేసే రోజు-లోకేష్
    ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చాం
    మన శాశ్వత రాజధాని అమరావతే-లోకేష్
    ఏపీకి అనేక ప్రాజెక్టులు తరలివస్తున్నాయి
    20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం
    ఏపీని నంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతాం-లోకేష్
  • 15 Aug 2026 10:04 AM (IST)

    కాకినాడలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    జెండాను ఆవిష్కరించిన డిప్యూటీ సీఎం పవన్‌
    ఒక తరం స్వాతంత్ర్యం కోసం పోరాడింది
    మరో తరం స్వాతంత్ర్యాన్ని కాపాడింది-పవన్‌
    బలమైన, సమర్థ దేశంగా భారత్‌ ఎదిగింది
    ప్రపంచానికి నాయకత్వం వహించే దిశగా..
    భారత్‌ అడుగులు వేస్తోంది-డిప్యూటీ సీఎం పవన్‌
    వికసిత్‌ భారత్‌లో ఏపీ పాత్ర పోషిస్తోంది
    కేంద్రం అండతో అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం-పవన్
  • 15 Aug 2026 10:04 AM (IST)

    అమరావతిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    జాతీయ జెండాను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
    పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన చంద్రబాబు
    ఎందరో వీరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యం: సీఎం చంద్రబాబు
    అల్లూరి, పింగళి తెలుగు నేలకు గర్వకారణం : సీఎం చంద్రబాబు
    2047 నాటికి దేశం, ఏపీని నెంబర్‌వన్‌గా నిలపాలి : సీఎం చంద్రబాబు
    లక్ష్య సాధనకు రానున్న 20 ఏళ్లు కష్టించి పనిచేయాలి: సీఎం చంద్రబాబు
    దేశనిర్మాణంలో అందరూ భాగస్వామ్యం అవ్వాలి: చంద్రబాబు
    వికసిత్‌ భారత్ 2047.. స్వర్ణాంధ్ర స్వప్నం సాకారం చేసుకోవాలి-చంద్రబాబు
    విధ్వంసం నుంచి వికాసం వైపు పాలన సాగిస్తున్నాం: చంద్రబాబు
    స్వర్ణాంధ్ర-2047 లక్ష్యంగా పాలన చేస్తున్నాం : చంద్రబాబు
    పది సూత్రాల అజెండాతో ముందుకు సాగుతున్నాం : చంద్రబాబు
    అభివృద్ధి వికేంద్రీకరణ మా విధానం : చంద్రబాబు
    విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్ రీజియన్ల అభివృద్ధి చేస్తాం : చంద్రబాబు
    కేంద్ర సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చింది-చంద్రబాబు
  • 15 Aug 2026 09:59 AM (IST)

    తెలంగాణ సచివాలయంలో స్వాతంత్ర్య వేడుకలు

    జాతీయ జెండాను ఎగురవేసిన సీఎస్‌ సంజయ్‌ జాజు
  • 15 Aug 2026 08:41 AM (IST)

    భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉంది-ప్రధాని మోదీ

    భారత్‌లో స్థిరమైన ప్రభుత్వం ఉందని ప్రధాని మోదీ అన్నారు. 2014 తర్వాత 40 దేశాలతో ట్రేడ్‌ అగ్రిమెంట్‌లు చేశామని తెలిపారు. మన టెక్స్‌టైల్, ఫార్మా, మత్స్య సంపద రక్షిస్తోందన్నారు. యువకులు, మహిళలు, రైతులు, శ్రామికులపై భరోసా ఉందన్నారు. త్వరలో Next లెవెల్‌ రిఫామ్స్‌ జరగబోతున్నాయన్నారు మోదీ. సప్తధార శక్తితో దేశానికి మరింత ఊతమిస్తామన్నారు. సప్తధార శక్తిలో మొదటిది తయారీ శక్తి.. భారత్‌ని గ్లోబల్‌ సప్లై చైన్‌గా మార్చాలన్నారు.

    గ్లోబల్ మార్కెట్‌లో మన వస్తువులు క్వాలిటీ ఉండాలన్నారు. సప్తధారలో రెండోది ఫుడ్‌ ప్రొడక్షన్‌, కెమికల్‌ ఫ్రీగా ఫుడ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ఉండాలన్నారు. సప్తధారలో మూడోది టెక్నాలజీ.. ఏఐ, డేటా సెంటర్స్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌గా ఉండాలన్నారు. సప్తధారలో నాలుగోది గతిశక్తి.. దేశంలో ఫాస్ట్‌ కనెక్టివిటీ పెరగాలన్నారు. సప్తధారలో ఐదోది రక్షణ శక్తి డిఫెన్స్‌ రంగంలో భారత్‌ ఆత్మనిర్భర్‌గా ఎదగాలన్నారు. సప్తధారలో ఆరోది గ్రీన్‌ ఎకానమీ, బ్లూ ఎకానమీ సప్తధారలో ఏడోది యువశక్తి అన్నారు మోదీ.

  • 15 Aug 2026 08:36 AM (IST)

    ఏపీ శాసనమండలిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    జాతీయ జెండాను ఆవిష్కరించిన చైర్మన్‌ మోషేన్ రాజు
    దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది
    యువతకు ఉపాధి కల్పించాలి-చైర్మన్ మోషేన్‌ రాజు
  • 15 Aug 2026 08:12 AM (IST)

    ప్రజలకు చంద్రబాబు స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

    స్వాతంత్య్ర సమరయోధులకు నిజమైన నివాళి దేశ నిర్మాణమే
    దేశం నాకు ఏం చేసిందని కాదు..
    దేశానికి ఏం చేయగలమో ఆలోచించాలి
    2047నాటికి వికసిత్ భారత్,స్వర్ణాంధ్ర సాకారం చేయాలి
    వందేళ్ల స్వాతంత్య్ర వేడుకలనాటికి సమృద్ధి సాధించాలి
    దేశం, రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగాలి-చంద్రబాబు
  • 15 Aug 2026 08:12 AM (IST)

    ప్రజలకు రేవంత్ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

    నూతన ఉత్సాహం, చైతన్యం నింపాలని సీఎం ఆకాంక్ష
    సమరయోధుల త్యాగాలను స్మరించుకోవాలి-సీఎం రేవంత్
    సమానత్వంతోనే బలమైన ప్రజాస్వామ్య భారత నిర్మాణం
    భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడాలి-సీఎం రేవంత్
  • 15 Aug 2026 08:07 AM (IST)

    తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

    తెలంగాణ అసెంబ్లీలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
    శాసన మండలిలో జెండా ఆవిష్కరించిన చైర్మన్‌ గుత్తా
  • 15 Aug 2026 07:57 AM (IST)

    వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్‌- ప్రధాని మోదీ

    • ధృడ సంకల్పంతో ముందుకెళ్లాలి-ప్రధాని మోదీ
    • 2047 నాటికి వికసిత్‌ భారత్‌ కావాలని కల ఉంది
    • భారత్‌ వైపు ప్రపంచం చూస్తోంది-ప్రధాని మోదీ
    • 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు
    • వేగంగా అభివృద్ధి చెందే దేశం భారత్‌-మోదీ
    • 140 కోట్ల మంది సంకల్పాన్ని అడ్డుకోవడం అసాధ్యం: మోదీ
  • 15 Aug 2026 07:55 AM (IST)

    PM Modi: దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు: ప్రధాని మోదీ

    • దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు-మోదీ
    • స్వాతంత్ర సమరయోధులను స్మరించుకున్న మోదీ
    • తొలిసారి ఎర్రకోటలో వందేమాతరం ఆలపించాం
    • దేశం కొత్త ఉత్సాహంతో ముందుకు వెళ్తోంది-మోదీ
    • ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోంది
    • ప్రతి హృదయం వందేమాతరంతో మార్మోగుతోంది-మోదీ
    • మనం పెద్ద పెద్ద కలలు కనాలి: మోదీ

Published On - Aug 15,2026 7:53 AM

Follow Us