ఇస్రో GSLV F17 రాకెట్ ద్వారా EOS-05 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. 2367 కిలోల ఈ ఉపగ్రహం దేశ సరిహద్దుల రక్షణ, వరదలు, భూకంపాలు వంటి ప్రకృతి విపత్తుల ముందస్తు గుర్తింపు, వ్యవసాయం, అటవీ, జలవనరుల పర్యవేక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. హైపర్ స్పెక్ట్రల్ కెమెరాలతో అత్యంత వేగంగా, స్పష్టమైన చిత్రాలను అందించగల ఈ ఉపగ్రహం భారతదేశానికి గొప్ప ఆస్తి.