బామ్మా నువ్వు గ్రేట్.. 80 ఏళ్ల వయసులోనూ సడలని సంకల్పం.. ఓటు వేసేందుకు 14 కి.మీ.నడిచి..

|

Nov 13, 2022 | 1:42 PM

ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిది. అది సామాన్య మానవుడి ఆయుధం. భావితరాల భవిష్యత్తును నిర్ణయించే శక్తి దీని సొంతం. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25 ను..

బామ్మా నువ్వు గ్రేట్.. 80 ఏళ్ల వయసులోనూ సడలని సంకల్పం.. ఓటు వేసేందుకు 14 కి.మీ.నడిచి..
Old Woman Voting
Follow us on

ప్రజాస్వామ్యానికి ఓటు పునాది వంటిది. అది సామాన్య మానవుడి ఆయుధం. భావితరాల భవిష్యత్తును నిర్ణయించే శక్తి దీని సొంతం. ఓటు అనే రెండక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25 ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా 18 సంవత్సరాలు నిండిన పౌరులందరికీ భారత రాజ్యాంగం ఓటు హక్కు కల్పించింది. ఆర్టికల్‌ 326 ద్వారా ఈ ఓటు హక్కును అందుబాటులోకి తీసుకువచ్చింది. దేశంలోని ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి. డబ్బు, మధ్యానికి అమ్ముడుపోయి ఓటు హక్కును దుర్వినియోగం చేయకూడదు. అయితే కొందరు ఓటు వేయడం పట్ల నిర్లక్ష్యం చూపిస్తుంటారు. పోలింగ్ సెంటర్ కు వెళ్లి, క్యూలో నిల్చుని ఓటు వేయడాన్ని భారంగా భావిస్తుంటారు. అలాంటి వారి వల్ల చాలా కొద్ది మంది మాత్రమే ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తద్వారా తక్కువ మంది అభిప్రాయంతోనే ప్రభుత్వం ఏర్పడుతుందన్న వాదన లేకపోలేదు.

ఓటు విలువ తెలిసిన ఓ 83 ఏళ్ల బామ్మ ఓటు హక్కును వినియోగించుకుంది. గడ్డకట్టే మంచుపై 14 కిలోమీటర్లు నడిచి వెళ్లి మరీ తన ఓటుహక్కును వినియోగించుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు పోటీపడి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రజాస్వామ్య పండుగలా అనిపించింది. యువత మాత్రమే కాదు, వృద్ధులు సైతం ఓటు వేసేందుకు ఉత్సాహం కనబరిచారు. పోలింగ్‌ స్టేషన్‌లకు రాలేని స్థితిలో ఉన్న 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు వారి ఇళ్ల వద్దే బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

అయితే.. డోల్మా అనే 83 ఏళ్ల వృద్ధురాలు పోలింగ్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అది కూడా పూర్తిగా మంచుతో నిండిపోయిన రోడ్డుపైన నడిచి వెళ్లి మరీ తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఓటు హక్కును నిర్లక్ష్యంచేసే ఎంతోమందికి ఈ బామ్మ ఆదర్శంగా నిలిచారని అధికారులు ప్రశంసించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..