మహారాష్ట్రలోని నాసిక్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. నాసిక్‌లో గత రాత్రి బస్సులో మంటలు చెలరేగాయి. ప్రయాణికులతో వస్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు మంటలంటుకున్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది దుర్మరణం పాలయ్యారని, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. నాసిక్‌లోని ఔరంగాబాద్ రహదారిపై తెల్లవారుజామున 5 గంటల సమయంలో ట్రక్కును ఢీకొనడంతో బస్సులో మంటలు చెలరేగాయి.
మహారాష్ట్రలోని నాసిక్‌లో శుక్రవారం అర్థరాత్రి బస్సులో మంటలు చెలరేగి పెద్ద ప్రమాదం జరిగింది. నాసిక్‌లో జరిగిన ప్రమాదంలో బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది సజీవ దహనమయ్యారు. 32 మంది గాయపడినట్లు సమాచారం. మృతులు, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది బృందం సహాయక చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం ఉదయం, నాసిక్ పోలీసులు మాట్లాడుతూ, “నాసిక్‌లో నిన్న రాత్రి (శుక్రవారం అక్టోబర్ 7) బస్సులో మంటలు చెలరేగడంతో 10 మంది మరణించినట్టుగా చెప్పారు. మృతదేహాలను, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య ఎంత అన్నది ఖచ్చితంగా చెప్పలేమన్నారు.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించగా పెద్ద ఎత్తున మంటలు బస్సును చుట్టుముట్టినట్లు వీడియోలు చూపించాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మంటల తీవ్రత కనిపిస్తోంది. మృతుల సంఖ్యను నిర్ధారించేందుకు ఇంకా ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..