దారుణం.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..

అరుణాచల్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతుల్లో ఓ ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది. ఈ సంఘటన..

దారుణం.. కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..

Updated on: Jul 11, 2020 | 7:35 PM

అరుణాచల్‌ ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడటంతో.. ఎనిమిది మంది మరణించారు. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మృతుల్లో ఓ ఎనిమిదేళ్ల పాప కూడా ఉంది. ఈ సంఘటన మొడిరిజో ప్రాంతంలోని పపుం పారే జిల్లా తిగ్డో గ్రామంలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించగా.. మృతదేహాలను వెలికి తీసి.. పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలోని పలు ప్రదేశాల్లో కొండచరియలు విరిగి.. ఇళ్లపై పడడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు తన ప్రగాఢ సానుభూతి తెల్పుతున్నానన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అనేక మార్గాల్లో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇతర ప్రాంతాలకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us