Coronavirus: హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు

Covid-19 victims cremated on one pyre: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. సెకండ్ వేవ్

Coronavirus: హృదయవిదారక ఘటన.. ఒకే చితిపై 8 మంది కరోనా మృతులకు అంత్యక్రియలు
Covid 19 Victims Cremated On One Pyre

Updated on: Apr 08, 2021 | 7:16 AM

Covid-19 victims cremated on one pyre: దేశంలో కరోనావైరస్ విలయతాండవం చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మళ్లీ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతోంది. సెకండ్ వేవ్ పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ కేంద్రం రాష్ట్రాలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. దేశంలో నమోదవుతున్న అత్యధిక కేసుల్లో 50శాతం కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్రలో హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు అందరినీ కంటతడి పెట్టిస్తున్నాయి. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ పునరావృతమవుతున్నాయి.

కరోనావైరస్‌ బారినపడి మరణించిన వారి అంత్యక్రియలకు స్మశానంలో స్థలం లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు జరిపించారు. ఈ ఘటన మహారాష్ట్రలోని బీడ్‌ జిల్లాలో మంగళవారం జరిగింది. బీడ్ జిల్లాలో కరోనా మరణించిన వారిని ముందుగా అంబాజ్‌గాయ్‌ పట్టణంలోని స్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే అవి కరోనా బారిన పడి మరణించిన వారి శవాలు కావటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు.

దీంతో అక్కడికి రెండు కిలోమీటర్ల దూరంలోని మరో శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. అక్కడ స్థలం సరిపడ లేకపోవడంతో ఒకే చితిపై ఎనిమిది మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించామని తెలిపారు.

Also Read:

West Bengal Election 2021: ఆ వ్యాఖ్యలపై 48 గంటల్లోగా సమాధానమివ్వండి.. మమతా బెనర్జీకి ఈసీ నోటీసులు

లవర్ నిరాకరించడంతో ఒంటికి నిప్పంటించుకున్న ప్రియుడు.. ఆమె ఇంటి గేటు ముందే ఘటన.. కారణాలు ఇలా ఉన్నాయి..