కశ్మీర్‌లో భారీ ఆపరేషన్స్‌.. 64 మంది ఉగ్రవాదులు హతం..!

గతేడాదిలాగే ఈ ఏడాది కూడా జమ్ముకశ్మీర్‌లో భారీగానే టెర్రర్ ఆపరేషన్స్‌ జరిగాయి. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 27 ఆపరేషన్ప్‌ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 64  మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. “జనవరి నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్స్ చేశాం. ఈ ఘటనలో 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా మరో 25 మంది ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశాం. ఈ క్రమంలో […]

కశ్మీర్‌లో భారీ ఆపరేషన్స్‌.. 64 మంది ఉగ్రవాదులు హతం..!

Edited By:

Updated on: May 07, 2020 | 5:11 PM

గతేడాదిలాగే ఈ ఏడాది కూడా జమ్ముకశ్మీర్‌లో భారీగానే టెర్రర్ ఆపరేషన్స్‌ జరిగాయి. గడిచిన ఐదు నెలల్లో మొత్తం 27 ఆపరేషన్ప్‌ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనలో మొత్తం 64  మంది ఉగ్రవాదులు హతమయ్యారని అధికారులు వెల్లడించారు. “జనవరి నుంచి మే 6వ తేదీ వరకు మొత్తం 27 టెర్రర్ ఆపరేషన్స్ చేశాం. ఈ ఘటనలో 64 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఇంకా మరో 25 మంది ఉగ్రవాదుల్ని సజీవంగా పట్టుకుని అరెస్ట్ చేశాం. ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్‌ ఉగ్రవాది, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ కమాండర్ రియాజ్‌ నైకూను బుధవారం మట్టుబెట్టాం. ఈ ఉగ్రవాది కోసం గత ఆరు నెలలుగా తీవ్రస్థాయిలో గాలింపు చర్యలు చేపట్టాం.”అని కశ్మీర్ రేంజ్ ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు.

కాగా.. గత మార్చి నెలలో కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నిత్యం పాక్ ప్రేరేపతి ఉగ్రవాదులు దేశంలో అలజడి సృష్టించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కుట్రలను సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొట్టింది. కేవలం లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో దాదాపు ముప్పై మంది ఉగ్రవాదుల్ని సైన్యం మట్టుబెట్టింది.

Loading...
Unable to load recommendations.
Follow Us