ఇదేం పగరా బాబూ.. 4వ తరగతిలో కొట్టాడనీ 50 ఏళ్ల తర్వాత రివెంజ్! చితక్కొట్టుకున్న వృద్ధులు

చిన్నప్పుడెప్పుడో నాలుగో క్లాస్‌ చిదివే రోజుల్లో జరిగిన ఓ గొడవకు 50 ఏళ్ల తర్వాత రివెంజ్‌ తీర్చుకున్నాడు. ఇన్నాళ్లు పగతో రగిలిపోయిన సదరు వ్యక్తి అదును చూసి చిన్ననాటి స్నేహితుడిపై దాడి చేశాడు. ఈ విచిత్ర ఘటన కేరళ కాసర్గాడ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

ఇదేం పగరా బాబూ.. 4వ తరగతిలో కొట్టాడనీ 50 ఏళ్ల తర్వాత రివెంజ్! చితక్కొట్టుకున్న వృద్ధులు
Man Takes Revenge After 50 Years In Kerala

Updated on: Jun 11, 2025 | 11:33 AM

కన్నూర్‌, జూన్ 10: ఓ వ్యక్తి చిన్నప్పుడు నాలుగో క్లాస్‌ చిదివే రోజుల్లో జరిగిన ఓ గొడవకు 50 ఏళ్ల తర్వాత రివెంజ్‌ తీర్చుకున్నాడు. ఇన్నాళ్లు పగతో రగిలిపోయిన సదరు వ్యక్తి అదును చూసి చిన్ననాటి స్నేహితుడిపై దాడి చేశాడు. ఈ విచిత్ర ఘటన కేరళ కాసర్గాడ్‌లో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే..

కేరళలోని కసర్గాడ్‌లో 54 ఏళ్ల క్రితం బాలకృష్ణన్‌ (62), వీజే బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే బడిలో నాలుగో తరగతిలో క్లాస్‌మేట్స్‌. అప్పట్లో వీజే బాబుకి, బాలకృష్ణన్‌కు ఏదో విషయమై గొడవ జరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన వీజేబాబు.. బాలకృష్ణన్‌ను లాగిపెట్టి కొట్టాడు. దీంతో అతడి నోట్లో పన్ను ఒకటి విరిగింది. అయితే బడిలోని టీచర్ల జోక్యంతో ఆ వివాదం సర్దుమనిగింది. కానీ బాలకృష్ణన్‌ మాత్రం మర్చిపోలేదు. ఆ తర్వాత అతను పెరిగి పెద్దవాడయ్యాడు. అతడితోపాటు అతని పగ కూడా మనసులో చెరకుండా దాచుకున్నాడు.

ఇటీవల పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. అక్కడికి బాలకృష్ణన్‌తోపాటు వీజేబాబు కూడా వచ్చాడు. అంతే మనసులో దాచుకున్న పగ ఒక్కసారిగా పెళ్లుబికింది. నాలుగో తరగతిలో నన్నుందుకు కొట్టావని బాలకృష్ణన్‌.. వీజే బాబుని అడిగాడు. అంతే ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే చివరికి అది కాస్తా హద్దుమీరడంతో బాలకృష్ణన్‌, వీజే బాబుపై దాడిచేశాడు. వీజే బాబు కాలర్‌ పట్టుకుని బలమైన రాయి ఒకటి తీసుకుని అతడి ముఖం, వీపుపై కొట్టాడు బాలకృష్ణన్‌. ఈ సంఘటన జూన్‌ 2న జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.