ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కుటుంబ సభ్యులు మృతిచెందడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ జిల్లాలో చోటు చోటుచేసుకుంది. కాగా, మృతుల్లో నలుగురు చిన్నారులు కూడా ఉండటం అందరిని మరింతగా కలచివేసింది. ఉదయ్‌పూర్‌లో సోమవారం నలుగురు పిల్లలతో సహా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అనుమానాస్పద స్థితిలో మరణించారు. గోగుండ పట్టణంలోని ఇంట్లోని ఓ గది దంపతులు, నలుగురు పిల్లల మృతదేహాలు లభించాయి. ఇంట్లో ఒక మహిళ, ఒక చిన్నారి మృతదేహం నేలపై గాయాల గుర్తులతో పడి ఉండగా, మిగిలినవి పై కప్పుకు వేలాడుతూ కనిపించాయి.
మృతులు గోగుండా పట్టణానికి చెందిన ప్రకాష్ గామేటి, 27 ఏళ్ల భార్య దుర్గా, వారి నలుగురు పిల్లలతో కలిసి తన సోదరుల ఇళ్లకు సమీపంలోని ఇంటిలో నివసిస్తున్నాడు. అయితే, సోమవారం ఎంతసేపటికీ వారి ఇంటి తలుపు తెరుచుకోలేదు. దీంతో ప్రకాష్ సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ ఇంటి వద్దకు వచ్చారు. తలుపులు బద్ధలుకొట్టి లోనికి వెళ్లి చూశారు. ప్రకాష్, ముగ్గురు పిల్లలు సీలింగ్‌కు వేలాడుతూ చనిపోగా, భార్య దుర్గా, మరో చిన్నారి నేలపై విగతజీవులుగా పడి ఉన్నారు. భార్య శరీరంపై గాయాలున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఆ కుటుంబం ఈ కఠిన నిర్ణయం తీసుకుని ఉంటుందని అనుమానించారు.
Rajasthan | Today morning I came to Panchayat, and I got to know that there was an incident in the Gokunda area. All six members of a family were found dead inside the house, police were informed & a probe was initiated, said the sarpanch of the village pic.twitter.com/c5k2ifuWs5
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) November 21, 2022
కాగా, ప్రకాష్ తొలుత తన భార్య, చిన్నారిని గొంతునులిమి హత్య చేసిన తర్వాత ముగ్గురు పిల్లలను సీలింగ్‌కు వేలాడదీసి చంపి చివరకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఫోరెన్సిక్ బృందం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతుడు ప్రకాష్ గుజరాత్‌లో పని చేసేవాడని, బస్సుల్లో పళ్లు అమ్మేవాడని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోరెన్సిక్, డాగ్ స్క్వాడ్ బృందాలతో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి