Parliament Smoke Scare: భద్రత ఏమైపోయినట్లు.. చెక్‌పాయింట్స్ ఎటుపోయినట్లు?

|

Dec 13, 2023 | 10:00 PM

పార్లమెంట్‌లో ఎల్లో కలర్ స్మోక్ క్యాన్‌నే ప్రయోగించారు అగంతకులు. సాధారణంగా ఏ చిన్న మెటల్ వస్తువు తీసుకెళ్లినా చెక్‌ పాయింట్స్‌లో దొరికిపోతారు. దీంతో.. సాగర్ శర్మ, మనోరంజన్ స్టీల్ పుల్లర్ ప్లేస్‌లో బహుశా ఏ ప్లాస్టికో, గట్టి దారమో ఏర్పాటు చేసుకుని ఉంటారు. క‌ల‌ర్ స్మోక్‌నే స్మోక్ క్యాన్స్, స్మోక్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. అన్ని రిటైల్ మార్కెట్లో కూడా వీటిని విక్రయిస్తారు. అయితే ఎక్కువ‌గా మిల‌ట‌రీ అధికారులు వినియోగిస్తారు..

Parliament Smoke Scare: భద్రత ఏమైపోయినట్లు.. చెక్‌పాయింట్స్ ఎటుపోయినట్లు?
Parliament
Follow us on

హోలీ రోజు కలర్ క్యాన్స్ వెదజల్లితే రంగుల పండుగ అవుతుంది. దీపావళి రోజు కాల్చితే వెలుగుజిలుగుల సంబరం అవుతుంది. కానీ, దేశవ్యాప్త ప్రజాప్రతినిధులు ఉన్న పార్లమెంట్‌లోకి చొరబడి స్మోక్ క్యాన్స్ వదిలితే అది దాడి అవుతుంది.. అతిపెద్ద నేరం అవుతుంది. ఇవాళ మన లోక్‌సభలో జరిగింది అదే.. ! మరి ఈ స్మోక్‌ బాంబ్‌ని ఏలా ఆపరేట్‌ చేశారో చూద్దాం..

ఇక్కడ మీరు చూస్తున్న పొగ గ్రీన్‌ కలర్‌లో ఉంది. కానీ ఇలాంటి ఎల్లో కలర్ స్మోక్ క్యాన్‌నే ప్రయోగించారు అగంతకులు. సాధారణంగా ఏ చిన్న మెటల్ వస్తువు తీసుకెళ్లినా చెక్‌ పాయింట్స్‌లో దొరికిపోతారు. దీంతో.. సాగర్ శర్మ, మనోరంజన్ స్టీల్ పుల్లర్ ప్లేస్‌లో బహుశా ఏ ప్లాస్టికో, గట్టి దారమో ఏర్పాటు చేసుకుని ఉంటారు. క‌ల‌ర్ స్మోక్‌నే స్మోక్ క్యాన్స్, స్మోక్ బాంబ్స్ అని కూడా పిలుస్తారు. అన్ని రిటైల్ మార్కెట్లో కూడా వీటిని విక్రయిస్తారు. అయితే ఎక్కువ‌గా మిల‌ట‌రీ అధికారులు వినియోగిస్తారు. వారితో పాటు స్పోర్ట్స్ ఈవెంట్స్ నిర్వహించే వారు, ఫోటో షూట్ల‌లో కూడా ఈ క‌ల‌ర్ స్మోక్‌ను వినియోగిస్తారు.

ప్రధానంగా ప్రత్యర్థుల‌ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మిల‌ట‌రీ, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆప‌రేష‌న్ల‌లో ఈ స్మోక్‌ను వినియోగిస్తారు. వారి క‌ద‌లిక‌ల‌ను అడ్డుకొని, శత్రువుల క‌ళ్లు క‌నిపించ‌కుండా చేసేందుకు ఈ క‌ల‌ర్ స్మోక్ ఉప‌యోగ‌ప‌డుతుంది. ఎయిర్ స్ర్టైక్స్, ట్రూప్ ల్యాండింగ్స్‌ల్లోనూ క‌ల‌ర్ స్మోక్‌ను వినియోగిస్తారు. వివాహ వేడుక‌ల‌తో పాటు ఫోటో షూట్ల‌లో ఎఫెక్ట్స్ కోసం కూడా క‌ల‌ర్ స్మోక్‌ను వినియోగిస్తారు. ఆట‌ల్లో అయితే ప్రధానంగా ఫుట్ బాల్ గేమ్‌లో విరివిగా ఈ స్మోక్‌ను వినియోగించ‌నున్నారు. త‌మ జ‌ట్టు ప్రాధాన్యత తెలిపే క‌ల‌ర్స్‌ను అభిమానులు వ‌దులుతారు.

దేశ ప్రధాని, ప్రతిపక్ష నేత, ఇతర పార్టీల ఎంపీలు.. వీళ్లు ఒక్కరే.. వేలు, లక్షలాది మంది మధ్యలోకి వెళితే ఒక్కరు కూడా వాళ్లదాకా చేరకుండా పటిష్టమైన భద్రత ఉంటుంది. అలాంటి అంతమంది ఎంపీలు కొలువైన లోక్‌సభలోకి ఇద్దరు అగంతకులు చొరబడి ఇంత హడావిడి చేశారంటే భద్రత ఏమైపోయినట్లు.. చెక్‌పాయింట్స్ ఎటుపోయినట్లు? ఆ స్మోక్ క్యాన్‌తో ఎలాంటి ప్రమాదంలేదని, ఆ పొగతో ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటించినా.. పొరపాటున ఆ స్థానంలో మరేదైనా ముప్పు ఉండి ఉంటే..! ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి