Murder: ఏయిర్‌ఫోర్స్‌ ట్రైనీ క్యాడెట్‌ అనుమానాస్పద మృతి! ఆరుగురు IAF అధికారులపై హత్యాకేసు..

|

Sep 26, 2022 | 3:51 PM

ఐఏఎఫ్ ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై పోలీసులు హత్యాకేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీ (AFTC)లో చోటుచేసుకున్న ఈ ఘటన నాలుగైదు రోజుల క్రితమే జరిగి ఉంటుందని..

Murder: ఏయిర్‌ఫోర్స్‌ ట్రైనీ క్యాడెట్‌ అనుమానాస్పద మృతి! ఆరుగురు IAF అధికారులపై హత్యాకేసు..
IAF Trainee Murder case
Follow us on

IAF trainee cadet suicide case: ఐఏఎఫ్ ట్రైనీ క్యాడెట్ ఆత్మహత్య వ్యవహారంలో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై పోలీసులు హత్యాకేసు నమోదు చేశారు. బెంగళూరులోని ఎయిర్‌ ఫోర్స్‌ టెక్నికల్‌ కాలేజీ (AFTC)లో చోటుచేసుకున్న ఈ ఘటన నాలుగైదు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకెళ్తే.. ఏఎఫ్‌టీసీ క్యాంపస్‌లోని ఓ గదిలో అంకిత్ ఝా(27) అనే ట్రైనీ క్యాడెట్‌ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతనిపై అప్పటికే ఓ కేసు నిమిత్తం కోర్టు విచారణ సాగుతోంది. దీంతో అతన్ని ట్రైనింగ్‌ నుంచీ తొలగించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో మనస్థాపానికి గురైన సదరు వ్యక్తి నాలుగైదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి అమన్ ఝా ఫిర్యాదు మేరకు సెప్టెంబర్ 24న (శనివారం) స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఆరుగురు ఎయిర్‌ఫోర్స్‌ అధికారులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనలో సెప్టెంబరు 24న తెల్లవారుజామున 4 గంటల 30 నిముషాలకు సదరు ఏఎఫ్‌టీసీ అధికారులు సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నం చేశారని మృతుడి సోదరుడు అమన్ ఝా తన ఫిర్యాదులో ఆరోపించారు. ఏఎఫ్‌టీసీ అధికారులకు ఏ సంబంధంలేకపోతే తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నట్లు AFTC అధికాలకు ఎలా తెలుసని అనుమానం వ్యక్తం చేశారు. తన సోదరుడు అంకిత్ ఝాని కాలేజీ క్యాంపస్‌ అధికారులు వేధింపులకు గురి చేసినట్లు, అందుకే ఆత్మహత్యకు పాల్పడినట్లు అరోపణలు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు సదరు ఏఎఫ్‌టీసీ అధికారులను అరెస్టు చేయలేదు. ఈ కేసుకు సంబంధించి భారత వైమానిక దళం అన్ని విధాల సహకరిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. కాగా మృత దేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా.. మృతికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసధికారి ఒకరు మీడియాకు తెలిపారు.