AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5 వేల లీటర్ల పాలు.. నేలపాలు! పిచ్చి పని కాదు.. అసలు మ్యాటర్‌ తెలిస్తే షాక్‌ అవుతారు..

ఆగ్రాలో 5,000 లీటర్ల కల్తీ పాలు స్వాధీనం చేసుకుని, రోడ్డుపై పారబోశారు అధికారులు. మధ్యప్రదేశ్ నుండి ఆగ్రాకు తరలిస్తున్న ట్యాంకర్‌లోని పాలను తనిఖీ చేసినపుడు కల్తీ పాలుగా తేలింది. కల్తీ పాల వల్ల ఇద్దరు పిల్లలు మరణించిన సంఘటన కూడా వెలుగులోకి వచ్చింది.

5 వేల లీటర్ల పాలు.. నేలపాలు! పిచ్చి పని కాదు.. అసలు మ్యాటర్‌ తెలిస్తే షాక్‌ అవుతారు..
Adulterated Milk
SN Pasha
|

Updated on: Jul 13, 2025 | 7:11 PM

Share

ట్యాంకర్‌ నిండా దాదాపు 5 వేల లీటర్ల పాలు ఉన్నాయి. కొద్ది సేపట్లో అవి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంది. కానీ, సడెన్‌గా కొంతమంది వచ్చి.. ఆ పాలను నేలపాలు చేశారు. అదేంటి వాళ్లకేమైనా పిచ్చిపట్టిందా? చిక్కటి పాలను అలా నేల పాలు చేశారని అనుకుంటున్నారా? నిజానికి వాళ్లు అలా చేసి చాలా మంచి పని చేశారు. ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలు రక్షించారు. అది ఎలాగంటే.. ఆ ట్యాంకర్లో ఉన్న పాలు కల్తీవి. మధ్యప్రదేశ్‌ నుంచి ఆగ్రాకు వస్తున్న పాల ట్యాంకర్‌ను అధికారులు ఆపి తనిఖీ చేశారు. అవి కల్తీ పాలు అని తేలడంతో అక్కడికక్కడే అంతా రోడ్డు పక్కన పారపోశారు. అయితే పాలు పారపోస్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఈ ఘటనకు సంబంధించి ఆహార శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్ర శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ట్యాంకర్‌లో థర్మోస్టాట్ లేకుండా పాలు నింపారని, దీంతో అవి కల్తీ పాలని అని తేలిందని అన్నారు. ట్యాంకర్‌కు UP 80 GT 8088 నంబర్ ఉందని, మధ్యప్రదేశ్‌లోని కైలారస్ మోరెనాలో ఉన్న త్యాగి డెయిరీ నుండి దీనిని పంపినట్లు ఆయన తెలిపారు. FSDA బృందం పాల నమూనాలను పరీక్ష కోసం పంపింది. నివేదిక వచ్చిన తర్వాత సంబంధిత డెయిరీ ఆపరేటర్ సుఖేంద్ర త్యాగిపై తగిన చర్యలు తీసుకుంటారు. ఈ పాలను ఆగ్రాలోని బాహ్ ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంది. ట్యాంకర్ డ్రైవర్ రవీంద్ర రావత్ ఆగ్రాలో విక్రయించడానికి పాలను తీసుకువస్తున్నట్లు చెప్పాడు. పాలు పరిమాణం 5000 లీటర్లు, దాని విలువ దాదాపు రూ.1.25 లక్షలు ఉంటుందని అంచనా.

కల్తీ పాలు తాగి ఇద్దరు పిల్లలు మృతి

కాగరౌల్‌లో గురువారం రాత్రి పాలు తాగిన ఇద్దరు అమాయక పిల్లలు మరణించారు. మరణించిన పిల్లల్లో 11 నెలల వయసున్న అవాన్, రెండేళ్ల మహిరా ఉన్నారు. ఈ పిల్లలకు జాగ్నేర్‌లోని బచ్చుస్ డెయిరీ నుంచి తెచ్చిన పాలు తాగించారు. ఈ డెయిరీపై కూడా సంబంధిత అధికారులు దాడులు చేసి నమూనాలను సేకరించారు. కల్తీ చేసేవారిపై పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి కల్తీ జరిగితే కఠిన చర్యలు తప్పవని ఆహార శాఖ హెచ్చరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..