Earthquake: గుజరాత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..

Gujarat Earthquake: ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం

Earthquake: గుజరాత్‌లో భూకంపం.. భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీసిన జనం..
Earthquake

Updated on: Nov 04, 2021 | 4:52 PM

Gujarat Earthquake: ఉత్తర భారతదేశంలో తరచూ సంభవిస్తున్న భూకంపాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా దీపావళి పండుగనాడు గురువారం గుజరాత్ రాష్ట్రంలో భూకంపం సంభవించింది. మధ్యాహ్నం 3.15 గంటల సమయంలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5గా నమోదైనట్లు తెలిపింది. గుజరాత్ లోని ద్వారకకు ఉత్తర వాయువ్య దిశగా 223 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. మధ్యాహ్నం వేళ ఒక్కసారిగా భూమి కంపించడంతో.. గుజరాత్ ప్రజలు భయంతో ఇళ్లల్లోనుంచి బయటకు పరుగులు తీశారు.

Also Read:

Lalu Prasad Yadav: అదంతా ఎన్నికల డ్రమానే.. రూ.50 తగ్గిస్తే ప్రజలకు అసలైన మేలు: ఆర్జేడీ అధినేత లాలూ

Hooch Tragedy: పండుగ పూట విషాదం.. కల్తీ మద్యం తాగి ఎనిమిది మంది మృత్యువాత..