ప్రతి సంవత్సరం, పబ్లిక్ సర్వీస్ కమీషన్ కొంతమంది ప్రత్యేక అభ్యర్థులను చూస్తుంది. ఈసారి ఈ తల్లీ కొడుకుల ద్వయం ఇలా అందరి దృష్టిని ఆకర్షించింది. కేరళ PSC ఫలితాలు ఆగస్టు 3న ప్రకటించబడ్డాయి. ఇందులో కేరళకు చెందిన 42 ఏళ్ల తల్లి బిందు తన 24 ఏళ్ల కుమారుడు వివేక్‌తో కలిసి కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పిఎస్‌సి) పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆమె, కొడుకు ఇద్దరూ కలిసి ప్రభుత్వోద్యోగంలోకి అడుగుపెట్టనున్నారు. కేరళ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన లాస్ట్ గ్రేడ్ సర్వెంట్స్ (LGS) పరీక్షలో వివేక్ లోయర్ డివిజనల్ క్లర్క్ (LDC) పరీక్షలో 38 ర్యాంక్‌తో ఉత్తీర్ణత సాధించగా, బిందు 92 ర్యాంక్ సాధించింది.
అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్న బిందు ఆదివారం మాత్రమే కోచింగ్ తరగతులకు హాజరయ్యేది. ఆమె ఐసిడిఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్ (ఐసిడిఎస్) సూపర్‌వైజర్ పరీక్ష కోసం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పుడు ఆ ప్రయత్నాలే ఎల్‌జిఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి సహాయపడ్డాయని తన తల్లిని ప్రశంసించాడు వివేక్..ఇక తన తల్లి బిందు తనను ఎలా ప్రోత్సహించిందో వివరించాడు. “మేమిద్దరం కలిసి చదువుకున్నాం కానీ కలిసి అర్హత సాధిస్తామని ఊహించలేదు”‘ అని వివేక్ తెలిపారు. అయితే, 42 ఏళ్ల తన తల్లి పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి ఇది నాల్గవ ప్రయత్నమని, అతడు పరీక్షకు హాజరు కావడానికి అర్హత పొందిన తర్వాత, తన తల్లిని కూడా కోచింగ్‌లో చేర్చించినట్టుగా వివరించాడు.
Kerala | A 42-year-old mother and her 24 years old son from Malappuram have cleared Public Service Commission (PSC) examination together pic.twitter.com/BlBKYJiDHh
— ANI (@ANI) August 10, 2022
ఇలాంటి స్పూర్తిదాయకమైన వార్తలతో ఇంటర్నెట్ థ్రిల్ అయ్యింది. డైనమిక్ ద్వయాన్ని అభినందించింది. ఒక వినియోగదారు ఇలా వ్రాశారు, “ఈ రకమైన వార్తలు నిజమైన ప్రేరణ…” మరొకరు ఇలా వ్యాఖ్యానించారు, “వయస్సు కేవలం ఒక సంఖ్య ! విద్య, ఉన్నత చదువులు అభ్యసించడానికి వయోపరిమితి లేదు…..! అంటూ కామెంట్లతో ప్రశంసలు కురిపించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి