Parliament: పార్లమెంట్‌లో మళ్లీ రచ్చ.. కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా 34 మంది సస్పెన్షన్..

|

Dec 18, 2023 | 3:46 PM

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం కూడా రచ్చ కొనసాగింది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తర్వాత.. అధికార, విపక్షాల మధ్య మాటల వేడి కొనసాగుతోంది. ఈ తరుణంలో సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్ 34 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు.

Parliament: పార్లమెంట్‌లో మళ్లీ రచ్చ.. కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా 34 మంది సస్పెన్షన్..
Parliament Winter Session
Follow us on

Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సోమవారం కూడా రచ్చ కొనసాగింది. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన తర్వాత.. అధికార, విపక్షాల మధ్య మాటల వేడి కొనసాగుతోంది. ఈ తరుణంలో సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ గందరగోళం మధ్య లోక్‌సభ స్పీకర్ 34 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. సభలో నిరంతరం గందరగోళం సృష్టించడం, కుర్చీలో కూర్చోకుండా ఆందోళన చేయడంపై లోక్ సభ స్పీకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు 34 ఎంపీలపై ఈ సస్పెన్షన్ విధించారు. అంతకుముందు శుక్రవారం కూడా 13 మంది విపక్ష ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేశారు. తాజాగా.. కాంగ్రెస్ సభా పక్ష నేత అధిర్ రంజన్ సహా.. 34 మందిపై సస్పెన్షన్ విధిస్తూ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు వీరిపై సస్పెన్షన్ విధించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ఎంపీలు సభ లోపల ప్లకార్డులు ప్రదర్శించడంతో ఈ చర్య తీసుకున్నారు.

ప్లకార్డులు ప్రదర్శించడం, నియమాలను ఉల్లంఘిస్తూ సభకు విరుద్దంగా ప్రవర్తించినందుకు కాంగ్రెస్‌కు చెందిన తొమ్మిది మంది ఎంపీలతో సహా 13 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన అనతీ కాలంలోనే మరో 34 మందిపై సస్పెన్షన్ విధించారు. ఇప్పటివరకు మొత్తం 47 మందిపై సస్పెన్షన్ విధించారు.

గత వారం బుధవారం నుంచి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా.. పార్లమెంట్ లో భద్రతా ఉల్లంఘనపై ప్రకటనలు చేయాలని కోరుతూ ప్రతిపక్షాలు వరుసగా వాయిదా తీర్మానాలు ఇస్తున్నాయి. దీనిపై శనివారం నాడు ప్రధాని మోదీ స్పందించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఈ ఘటనపై పార్లమెంట్‌లో చర్చ కాదు విచారణ అవసరం అని అన్నారు.

అయితే, అంతకుముందు సస్పెండ్ అయిన 13 మంది లోక్‌సభ ఎంపీలను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈరోజు కొందరు పార్లమెంట్ మెట్లు ఎక్కి ప్లకార్డులతో నిరసన తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..