బెంగుళూరులో 3 వేలమంది కోవిడ్ పాజిటివ్ రోగులు మిస్సింగ్, పోలీసుల సాయంతో ఆచూకీకై యత్నాలు

| Edited By: Phani CH

Apr 29, 2021 | 2:07 PM

కర్ణాటకలో  రోజూ కోవిడ్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు నమోదు కాగా..ఒక్క బెంగుళూరు నగరంలోనే 29 వేల కేసులు నమోదయ్యాయి...

బెంగుళూరులో 3 వేలమంది కోవిడ్ పాజిటివ్ రోగులు మిస్సింగ్, పోలీసుల సాయంతో ఆచూకీకై యత్నాలు
3000 Covid Patients Missing In Benguluru
Follow us on

కర్ణాటకలో  రోజూ కోవిడ్ కేసులు తామరతంపరగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 40 వేలకు పైగా కేసులు నమోదు కాగా..ఒక్క బెంగుళూరు నగరంలోనే 29 వేల కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 229 మంది రోగులు మృతి చెందారు. అయితే ఈ నగరంలో సుమారు 3 వేలమంది కోవిడ్ పాజిటివ్ రోగులు ఎవరికీ చెప్పా పెట్టకుండా తమ ఇళ్లనుంచి వెళ్లిపోయారట. వీరి మొబైల్ ఫోన్లు కూడా స్విచాఫ్ అయి ఉన్నాయని రాష్ట్ర రెవెన్యూ మంత్రి, కర్నాటక డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కూడా అయిన ఆర్.అశోక్ తెలిపారు. పోలీసుల సహకారంతో వారి ఆచూకీని కనుగొనేందుకు యత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. దయచేసి మీ మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేయకండి అని ఆయన వారిని ఉద్దేశించి ఓ ప్రకటన విడుదల చేశారు. అసలు  మీకు పాజిటివ్ సోకిందా అన్న విషయం నిర్ధారణ కావాలన్నారు.  ఒకవేళ మీ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆసుపత్రులకు వెళ్తే మరింత దారుణ పరిస్థితిని ఎదుర్కోవలసి ఉంటుందని, పైగా హాస్పటల్స్ లో బెడ్స్ కొరత కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. మిమ్మల్ని  ట్రాక్ చేయడానికి సుమారు 10 రోజులు పట్టవచ్చునని అన్నారు.

కోవిడ్ ప్రోటోకాల్ ని పాటిస్తే దాదాపు 90 మంది రోగులు కోలుకునే అవకాశం ఉందని అశోక్ అన్నారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్న వారికి ప్రభుత్వం ఉచిత మెడికేషన్ సౌకర్యం కల్పించిందని ఆయన పేర్కొన్నారు. మీ సెల్ ఫోన్లను స్విఛాఫ్ చేసుకుంటే మీకే నష్టం అని ఆయన మిస్సయిన వారిని ఉద్దేశించి  హెచ్చరించారు. బెంగుళూరుతో బాటు మైసూరు, కోలార్, బళ్లారి, హాసన్, తుమకూరు, మాండ్యా, తదితర జిల్లాల్లో కోవిద్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క బెంగూరు అర్బన్ లోనే 137 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మరణించినవారి సంఖ్య 15 వేలకు పైగా పెరిగింది. రాష్ట్రంలో 3 లక్షల 26  వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:Bengal Elections Phase-8 Voting LIVE: ప్రశాంతంగా సాగుతోన్న బెంగాల్ చివరి దశ ఓటింగ్.. బారులు తీరిన ఓటర్లు..

Covid-19 WHO: కరోనాపై సోషల్‌ మీడియాలో ప్రచారాలు.. వాస్తవాలపై క్లారిటీ ఇచ్చిన డబ్ల్యూహెచ్‌వో