Rafale Fighter Jet: భారతదేశ సైనిక శక్తి దినదినాభివృద్ధి చెందుతోంది. సైన్యం చేతికి అత్యాధునిక ఆయుద సంపత్తి వచ్చి చేరుతోంది. చూట్టూ వైరి దేశాలే ఉండటంతో మరింత అప్రమత్తంగా ఉంటోంది దేశ రక్షణ శాఖ. ఆ కారణంగానే శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇప్పటికే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న భారత త్రివిధ దళాలు.. మరింత ముందడుగు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అత్యంత శక్తివంతమైన రాఫెల్ ఫైటర్ జెట్లు కొన్ని వైమానిక దళంలో చేరగా.. ఇవాళ మరో మూడు రాఫెల్ యుద్ధ విమానాలు ఇండియాకు రానున్నాయి. ఈ ఫైటర్ జెట్లను తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఫ్రాన్స్‌కు వెళ్లింది. ఇవాళ రాత్రి 7 గంటల లోపు ఫ్రాన్స్ నుంచి ఆ రాఫెల్ ఫైటర్ జెట్లను ఇండియాకు తీసుకురానున్నారు. ఈ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి నేరుగా గుజరాత్‌కు చేరుకుంటాయి. అయితే, మధ్యలో యూఏఈలో ఆగి ఇంధనం నింపుకోనున్నాయి. ఇప్పటికే 11 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే.. భారత ప్రభుత్వం 2016 సెప్టెంబర్ నెలలో ఫ్రాన్స్ ప్రభుత్వంతో రూ. 59 వేల కోట్లతో 36 రాఫెల్ యుద్ధ విమానాల కోనుగోలుకు ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంలో భాగంగా ఫ్రెంచ్ కంపెనీ దసాల్ట్ ఏవియేషన్.. తొలి విడతగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలను సరఫరా చేయగా.. గతేడాది జులై 28న అవి దేశానికి చేరుకున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకు 11 రాఫెల్ యుద్ధ విమానాలు భారత వైమానిక దళంలో చేరాయి. ఇప్పుడు మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు భారత్‌కు రానున్నాయి. దీంతో వీటి సంఖ్య 14కు చేరనుంది. అలాగే.. మరో ఐదు ఫైటర్ జెట్లను ఏప్రిల్ చివరి నాటికి భారత్‌కు అప్పగించనున్నట్లు ఫ్రాన్స్ రాయబారి ఇమ్మాన్యుయేల్ లెనైన్ మంగళవారం పేర్కొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన రాఫెల్ ఫైటర్ జెట్లతో పాటు.. ఇప్పుడు వస్తున్న.. త్వరలో రాబోతున్న ఫైటర్ జెట్లు భారత వైమానిక దళంలోని గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్‌లో భాగం కానున్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న రాఫెల్ యుద్ధ విమానాలను.. లడఖ్ సరిహద్దుల్లో మోహరించారు.
Also read: