Viral: మెడికో ఇంట్లో పోలీసుల సోదాలు.. లోపల సెటప్ చూసి స్టన్

మెడిసిన్ చదువుకునే కుర్రాడు తప్పుదోవ పట్టాడు. మరో ఇద్దరితో కలిసి గలీజ్ దందాకు తెరలేపాడు. క్రియేటివిటీ వాడుతూ అక్రమ పద్దతుల్లో డబ్బు సంపాదించడం మొదలెట్టాడు. తాజాగా పాపం పండింది.

Viral: మెడికో ఇంట్లో పోలీసుల సోదాలు.. లోపల సెటప్ చూసి స్టన్
Ganja

Updated on: Jun 25, 2023 | 12:13 PM

పోలీసుల తనిఖీలు ఎక్కువయ్యాయి. కఠిన సెక్లన్లు పెట్టి మత్తుగాళ్లను జైళ్లలో పెడుతున్నారు. ఆటలు సాగడం లేదు. దీంతో కొందరు ఇళ్లల్లోనే గంజాయి పెంపకానికి పూనుకుంటున్నారు. ఇంటి డాబాపైన లేదా ఇంట్లోని ఏదో ఒక మూలన గంజాయి సెటప్ పెట్టేస్తున్నారు. తాజాగా  గంజాయి సాగు చేసి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను కర్ణాటలక శివమొగ్గ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వ్యక్తులను విఘ్నరాజ్, పండిదొరై, వినోద్ కుమార్‌లుగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదవుకుంటున్న విఘ్నరాజ్ అనే విద్యార్థి అధునాతన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి ఇంటి వద్ద గంజాయిని పెంచి, ఆపై పండిదొరై, వినోద్ కుమార్‌ల ద్వారా ఇతర కళాశాలల విద్యార్థులకు విక్రయిస్తున్నాడు. దాడుల్లో 227 గ్రాముల గంజాయి, 1.53 గ్రాముల పచ్చి గంజాయి, 10 గ్రాముల చరస్‌లు, గంజాయి విత్తనాలతో కూడిన చిన్న సీసా.. అక్రమ కార్యకలాపాలకు సంబంధించిన పలు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై శివమొగ్గ రూరల్ పోలీస్ స్టేషన్‌లో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం, ఇండియన్ పీనల్ కోడ్ (ఐపిసి) సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. తదుపరి విచారణ జరుగుతోంది. ఇంట్లో గంజాయి సాగు చేయడం ఇదే తొలిసారి కాదు. తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ తరహా మార్గాల్లో గంజాయి పెంచుతున్నారు. దీన్ని బట్టే అర్థమవుతుంది. గంజాయి దేశంలో ఎంత విచ్చిలవిడిగా లభ్యమవుతుందో.

గంజాయికు అలవాటు పడితే బంగారం లాంటి భవిష్యత్ నాశనం అయిపోతుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. టీనేజ్, యూత్ పిల్లల్ని పేరెంట్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలి.. వారి ప్రవర్తన మారితే.. దగ్గరకు పిలిచి మాట్లాడాలని సూచిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..