Crime News: పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో తెలిస్తే..

ఈ మధ్య కాలంలో జనాలు చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్నారు. క్షణికావేశంలో వారు తీసుకునే నిర్ణయాల వల్ల ఎన్నో కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్తున్నాయి. తాజాగా గుజరాత్‌లో అలాంటి ఘటనే వెలుగు చూసింది. భర్త కొత్త ఫోన్ కొనివ్వలేదనే కారణంతో 22 ఏళ్ల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

Crime News: పచ్చని కాపురంలో ఫోన్‌ చిచ్చు.. భర్తకు తెలియకుండా భార్య ఏం చేసిందో తెలిస్తే..
Gujarat Woman Suicide

Updated on: Jan 19, 2026 | 8:00 PM

గుజరాత్‌లోని ఆరావళి జిల్లాలో ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. మొబైల్ ఫోన్ విషయంలో తన భర్తతో జరిగిన వివాదం కారణంగా 22 ఏళ్ల వివాహిత ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు కోల్పోయింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేపాల్‌కు చెందిన ఊర్మిళ ఖానన్ రిజాన్ అనే ఆ మహిళ తన భర్త, బిడ్డతో కలిసి మోడసాలో నివసిస్తోంది. వీరు స్థానికంగా ఒక ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుతా తనకు కొత్త ఫోన్ కావాలని ఊర్మిళ తన భర్తను అడుగుతూ వచ్చింది. కానీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా భర్త ఆ విషయాన్ని పదేపదే దాటవేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి.

తాజాగా జరిగిన గొడవ తర్వాత తీవ్ర మనస్థాపానికి గురైన ఊర్మిల సంచలన నిర్ణయం తీసుకుంది. తన ఇంట్లోని ఫ్యాన్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. భార్య ఎక్కడా కనిపించకపోవడంతో కంగారు పడిన భర్త ఇంటికెళ్లి చూడగా.. ఇంట్లో ఫ్యాక్‌కు వేళాడుతూ కనిపించింది. అది చూసిన భర్త కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.